E-Paper
Advertisement

Mrunal Thakur: ధనుష్ కాదు… ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

Mrunal Thakur: ధనుష్ కాదు… ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
Advertisement

Mrunal Thakur: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వేగంగా వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఆమె పేరు ధనుష్‌తో జత చేయబడింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధనుష్ పేరు క్రమంగా పక్కకు వెళ్లిపోయి, ఇప్పుడు మృణాల్ పేరు సిద్ధాంత్ చతుర్వేదితో ఎక్కువగా వినిపిస్తోంది.

నిన్నటి నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఇది కేవలం గాసిప్ అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడు వరుసగా వస్తున్న అప్డేట్స్ చూసి, ఇది కేవలం రూమర్ కాదేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

Advertisement

మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది ఇద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘దో దీవానే సేహర్ మేన్’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 2026లో థియేటర్లలోకి రానుంది. సినిమా ప్రమోషన్ల సమయంలో వీరిద్దరి మధ్య కనిపిస్తున్న సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో మృణాల్, సిద్ధాంత్ కలిసి కనిపించారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా సౌకర్యంగా, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ కనిపించారు. వారి మధ్య ఉన్న అనుబంధం చూసిన అభిమానులు..ఇది సినిమాకే పరిమితమా లేక నిజ జీవితానికీ సంబంధమా?. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ చర్చకు మరింత ఊపొచ్చేలా సిద్ధాంత్ చతుర్వేది తన సోషల్ మీడియా ఖాతాలో ఓ రీల్ షేర్ చేశాడు. ఆ వీడియోకు సినిమా టైటిల్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టి, దో దీవానే ..అనే చిన్న క్యాప్షన్ మాత్రమే ఇచ్చాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమా దర్శకుడు రవి ఉద్యావర్. సాధారణ లవ్ స్టోరీలకంటే భిన్నంగా, నిజ జీవిత ప్రేమలో ఉండే భావోద్వేగాలు, అయోమయాలు, లోపాలను చూపించడమే ఈ సినిమా లక్ష్యమని చెబుతున్నారు. అందుకే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

జీ స్టూడియోస్, భన్సాలి ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మృణాల్.. సిద్ధాంత్ జంటలోని సహజమైన కెమిస్ట్రీ ఈ సినిమాకే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాలపై కూడా ఆసక్తిని పెంచుతోంది.

ఇది నిజమైన ప్రేమకథా? లేక సినిమా ప్రమోషన్‌లో భాగమా? అన్నది తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

ALSO READ: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కెరియర్ నిర్ణయించేది ఈ 2 సినిమాలే..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×