E-Paper
Advertisement

Parties Discuss with Devineni Uma: దేవినేని చూపు ఎటు..? ఓన్లీ త్రీ డేస్..!

Parties Discuss with Devineni Uma: దేవినేని చూపు ఎటు..? ఓన్లీ త్రీ డేస్..!
Advertisement
parties discuss with Devineni Uma
parties discuss with Devineni Uma

Parties Discuss with Devineni Uma: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్లు రాని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీలోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. కొందరు నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మరికొందరు మీడియా ముందుకు వస్తున్నారు. ఇంకొందరు లోలోపల కుమిలిపోతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం.

మైలవరం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్టప్రసాద్‌కు టికెట్ ఓకే అయ్యింది. అదే పార్టీ నుంచి టికెట్ ఆశించిన సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేవి ఉమకు ఈసారి సీటు దక్కలేదు. దీంతో ఏం చేయ్యాలో తెలియక కొద్దిరోజులుగా మధన పడుతున్నారు. దగ్గరవారితో తన బాధను చెప్పుకుంటున్నారు. దేవినేనికి ఈసారి టికెట్ రాకపోచ్చని నాలుగైదు నెలలుగా ప్రచారం సాగింది. కానీ అవన్నీ గాలి కబుర్లుగా ఆయన మద్దతుదారులు అప్పట్లో కొట్టిపారేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ఇక చేసిదేమీ లేక టీడీపీ హైకమాండ్‌పై నోరు విప్పలేక.. తన బుర్రకు ఆలోచన పెట్టారు.

Advertisement

ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టేశారు దేవినేని ఉమ. నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందర్నీ పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. టికెట్ రాలేదనే భావన కంటే.. ప్రజలతో ఉన్నానన్న ఆనందం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన జోరు చూస్తుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి గమనించిన మిగతా పార్టీలు.. దేవినేని ఉమను తమవైపు తిప్పుకునేందుకు మంతనాలు మొదలుపెట్టేశాయి.

Also Read: Pawan Varahi Yatra : పవన్ వారాహి యాత్ర వాయిదా.. మూడ్రోజులు పిఠాపురంలోనే మకాం

Advertisement

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సూచన మేరకు కొందరు నేతలు దేవినేనితో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలంటూ రాయబారం కూడా చేశారట. అంతేకాదు కృష్టాజిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతను దేవినేని భుజాలపై పెట్టినట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఈ నేపథ్యంలో దేవినేని ఆలోచనలో పడినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అంతా సజావుగా సాగితే ఆయన తన నిర్ణయాన్ని రెండుమూడు రోజుల్లో వెల్లడించే ఛాన్స్ వుందని అంటున్నారు. మరోవైపు టీడీపీలోని ముఖ్యనేతలు దేవినేనితో మంతనాలు సాగిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారట.

మైలవరం అంటే ముందుగా దేవినేని పేరు వినబడేది. టీడీపీలో ఆయన్ని ఫైర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌గా వర్ణిస్తుంటారు కొందరు నేతలు. టీడీపీ ప్రభుత్వంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. ప్రత్యర్థులపై  బాణాలు ఎక్కుపెట్టడంలోనూ ఆయనదే పైచేయి అని చెప్పుకుంటారు. గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి వసంత వర్సెస్ దేవినేని అన్నట్లుగా ఆ నియోజకవర్గం రాజకీయాలు సాగాయి. మరి ఈ క్రమంలో మైలవరం రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో తెలియాలంటే మరో వారం వెయిట్ చేయక తప్పదు మరీ!

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×