E-Paper
Advertisement

AP Assembly Session-2026: వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం.. హనుమంతుడి ముందు..

AP Assembly Session-2026: వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం.. హనుమంతుడి ముందు..
Advertisement

AP Assembly Session-2026: వైసీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సభలో సభ్యుల వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు. ఇది ముమ్మాటికీ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతుండగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు రభసపై పవన్ ఆగ్రహం

Advertisement

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. సాంకేతికంగా మూడో బడ్జెట్ సమావేశం అయినప్పటికీ, పూర్తిస్థాయి బడ్జెట్‌గా ఇది రెండోదన్నారు. ఐదు కోట్ల పైచిలుకు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తుందని ప్రస్తావించారు.

మరో మూడు నెలల్లో రెండేళ్లు పాలన పూర్తి చేసుకోనున్న కూటమి ప్రభుత్వం.. చాలా పరీక్షలు తట్టుకుని ముందుకు అడుగులు వేసిందన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఇచ్చిందని చెప్పారు. ఏపీ భవిష్యత్ కు బలమైన పునాదులు వేసిందన్నారు. వికసిత్ భారత్‌లో భాగంగా వికసిత్ ఏపీ లక్ష్యంగా సాగిందన్నారు.

Advertisement

హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే-డిప్యూటీ సీఎం

సామాజిక పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు పెంపు వంటివి ప్రధానంగా ప్రస్తావించారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం, అధికారుల ప్రమోషన్లు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి రభస చేసిన విధానం చూస్తుంటే తనకు ఒక్కటే అనిపించిందన్నారు. ఇది ముమ్మాటికీ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని అన్నారు.

151 సీట్ల నుంచి 11 కి పడిపోయిన వారిని చూసి మనం నేర్చుకోవాల్సి ఉందని, అదే సమయంలో భారతరత్న అటల్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. గత ప్రభుత్వం అరాచక పాలన, అసమర్థపు నిర్ణయాలు కలిసి కూటమి ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారాయని ప్రస్తావించారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు పాలనా అనుభవంతో అన్ని సమస్యలను అధిగమిస్తూ ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ: జైలు కష్టాలు పడి వచ్చాం.. అధికారం చూసి దారి తప్పుతారా?  

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×