E-Paper
Advertisement

Tollywood Movie OTT: చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మైథాలజికల్ థ్రిల్లర్ మూవీ!

Tollywood Movie OTT: చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మైథాలజికల్ థ్రిల్లర్ మూవీ!
Advertisement

Tollywood Movie OTT: ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలు ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతుంటే.. మరికొన్ని చిత్రాలు థియేటర్లలోకి వచ్చిన తరువాత కొన్ని రోజులకు ఓటీటీస్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే ఇలా ఓటీటీకి వచ్చే ముందు ఆయా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ముందుగానే ప్రమోషన్ చేసుకుంటున్నాయి. అయితే ఈమధ్య కాలంలో ప్రత్యేకించి కొన్ని చిత్రాలు చడీచప్పుడు లేకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసి అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే రీసెంట్ టైంలో తెలుగులో మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. అలాంటి వాటిలో ‘వనవీర’ కూడా ఒకటి. రామాయణంలోని కిష్కిందకాండ ఎపిసోడ్ తో ముడిపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఓటీటీ లోకి వచ్చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.

సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన తెలుగు మైథలాజికల్ మూవీ..

విషయంలోకి వెళ్తే.. అవినాష్ అనే ఒక కొత్త కుర్రాడు హీరోగా అలాగే దర్శకుడిగా చేసిన చిత్రం వనవీర. మొదట వానర అనే పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సెన్సార్ అభ్యంతరం వల్ల టైటిల్ మార్చారు.. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటించగా.. నందు శ్రీ విలన్ గా నటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో చాలా తెలుగు చిత్రాలు విడుదలకు రావడంతో దీనిని చాలామంది పట్టించుకోలేదనే వార్తలు వినిపించాయి. మరి ఓటీటీ లో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

ALSO READ:Chiranjeevi MSG Movie: ఓటీటీలోనూ శంకర్ గారిదే హవా.. ఒక్క రోజులోనే?

వనవీర సినిమా స్టోరీ ..

వనవీర సినిమా స్టోరీ విషయానికి వస్తే.. వనపురానికి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడు రఘు (అవినాష్). ఐఐటి పూర్తయినా ఊళ్లో ఖాళీగానే తిరుగుతూ ఉంటాడు. తండ్రి ప్రేమగా కొనిచ్చిన బైక్ అంటే ఎంతో ఇష్టం. దానిపై ఇంకొకరు చేయి వేస్తే సహించడు. అలాంటిది తప్పని పరిస్థితుల్లో ఒకసారి దేవా (నందు) రాజకీయ ర్యాలీ కోసం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బైక్ తన చేతికి రాకపోవడంతో రఘు తిరిగి దాన్ని తెచ్చుకునేందుకు దేవా ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు దేవాతో రఘ కి ఉన్న గొడవేంటి ? వీరిద్దరి మధ్యలోకి హీరోయిన్ ఎంట్రీ ఎలా ఉంటుంది? ఈ కథకు రామాయణంలోని వానర జాతికి ఉన్న సంబంధం ఏంటి? ఇలా తెలియాలి అంటే మిగతా స్టోరీ చూడాల్సిందే. థియేటర్లలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోని ఈ సినిమా ఇటు ఓటిటీ లోనైనా ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×