E-Paper
Advertisement

Statue of Sacrifice: పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహం: సీఎం చంద్రబాబు

Statue of Sacrifice: పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహం: సీఎం చంద్రబాబు
Advertisement

Statue of Sacrifice: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా జరిగాయి. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన స్మృత్యర్థం అమరావతిలోని శాఖమూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ (త్యాగమూర్తి విగ్రహం) అని నామకరణం చేశారు. ఈ చారిత్రక ఘట్టంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ విగ్రహం తయారీలో 30 టన్నుల కంచు 70 టన్నుల ఇనుప గడ్డర్లను ఉపయోగించారు. కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన శిల్పులు దీనిని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఆయన జీవితం మనందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. అమరజీవి త్యాగనిరతిని స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులర్పించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన వ్యక్తిగా చరిత్రలో ఆయన పేరు సుస్థిరమని కొనియాడారు.

Advertisement

ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పథకానికి ఇకపై ‘అమరజీవి జలధార’ అని పేరు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ పథకం ద్వారా ప్రజలు నీరు తాగే ప్రతిసారీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగానికి మానవరూపమే ఈ విగ్రహమని ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్ర రూపంలో ఆయన నిరంతరం జీవించే ఉంటారని చెప్పారు. ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి పోరాటం స్వార్థం లేనిదని కితాబిచ్చారు. నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం ఆయన చేసిన సామాజిక పోరాటాలను లోకేశ్ గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే పొట్టి శ్రీరాములు పేరుపై ప్రత్యేక నాణేన్ని (కాయిన్) విడుదల చేస్తామని ప్రకటించారు. అమరావతిలో కొలువుదీరిన ఈ విగ్రహం తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: LPG Statistics: దేశంలో గ్యాస్ సంక్షోభం.. LPG గురించి.. ఆశ్చర్యపరిచే వాస్తవాలు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×