E-Paper
Advertisement

CM Chandrababu: పవన్ ఫుల్ సపోర్ట్.. లోకేశ్ పట్టువదలని విక్రమార్కుడు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: పవన్ ఫుల్ సపోర్ట్.. లోకేశ్ పట్టువదలని విక్రమార్కుడు: సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: కూటమి నేతలు అందరం కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో పర్యటించిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంకా బాగా పని చేయండని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తనకు పూర్తి మద్దతు ఇస్తున్నారన్నారు. ప‌ని అప్పజెప్తే ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుడిలాగా మంత్రి లోకేశ్ ప‌ని చేస్తున్నారన్నారు. గ‌తంలో మూడుసార్లు సీఎంగా ప‌నిచేసిన‌ప్పటికీ, ఎప్పుడూ చేయ‌న‌న్ని ప‌నులు ఈసారి చేసేంత శ‌క్తి వ‌చ్చిందన్నారు. కూటమి నేతలు అందరం కలిసి పని చేస్తున్నామన్నారు.

గత వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి ఉన్న వాళ్లు ఎవరూ ఇలాంటి తప్పుడు పనులు చేయరని వైసీపీ మండిపడ్డారు. వైఎస్ జగన్ విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు.

Advertisement

“నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్‌ను. మనం వచ్చాక ప్రపంచంలో అందరికీ ఏపీపై నమ్మకం వచ్చింది. ఒకప్పుడు ఏపీ అంటే ఛీఛీ అనేవారు, ఇప్పుడు భలే భలే ఏపీ అంటున్నారు”- సీఎం చంద్రబాబు 

లోకేశ్ పట్టువదలని విక్రమార్కుడు

Advertisement

ప్రధాని మోదీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా, ఆయన సహకారంతో ఏపీలో తక్షణమే వాటిని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తున్నారన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా అప్పచెప్పిన టాస్క్ ను మంత్రి లోకేశ్ పూర్తి చేసుకుని వస్తున్నారని ప్రశంసించారు. ఐటీ ప్రభావం గురించి తాను 30 ఏళ్ల కిందటే చెప్పానని, టెక్నాలజీ గురించి ఆరోజు చెప్తే ఎవరూ నమ్మలేదన్నారు. నమ్మకపోగా కొందరు తనను 420 అన్నారన్నారు. కేవలం ఆరేడు దేశాల్లోనే ఉన్న క్వాంటం కంప్యూటర్ ను మొట్టమొదటిసారిగా అమరావతికి తెచ్చామన్నారు.

వైసీపీ విధ్వంస పాలన

“వైసీపీ విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. సోలార్ కంపెనీలతో గతంలో ఒప్పందాలు చేసుకుంటే.. వాళ్లు ఉత్పత్తి చేసిన కరెంట్ ను వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఎవరు చెప్పిన వినలేదు. జగన్ ఒక వితండవాది. చివరికి కోర్టు మొట్టికాయలు వేస్తే చివరికి పారిశ్రామిక వేత్తలకు రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి పరిస్థితి వచ్చింది. జగన్ ప్రజావేదికతో మొదలుపెట్టిన విధ్వంసం ఐదేళ్లు రాష్ట్రమంతటా కొనసాగింది” -సీఎం చంద్రబాబు 

Also Read: CM Chandrababu In Prakasam: త్వరలో కనకపట్నం.. మా టార్గెట్ అదే, ప్రకాశం జిల్లా టూర్‌లో సీఎం చంద్రబాబు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×