E-Paper
Advertisement

Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు
Advertisement

Chandrababu Naidu: ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినమ్రంగా స్పందించారు. సాధారణంగా తాను అవార్డులు స్వీకరించనని, గతంలో విదేశీ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. అయితే, ఈ అవార్డు వెనుక తన సహచరులు, అధికారులు, కలెక్టర్ల కృషి ఎంతో ఉందని, అందుకే ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై మాట్లాడుతూ.. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB)లో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండేదని, ఆ తర్వాత నిబంధనలు ఎన్నిసార్లు మారినా ఏపీనే అగ్రస్థానంలో నిలుపుతూ వచ్చామని తెలిపారు. ప్రస్తుతం గేర్ మార్చి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. గడిచిన 18 నెలల్లోనే 25 నూతన పాలసీలను తీసుకొచ్చి, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో (Escrow) ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టామని, త్వరలోనే దీనికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు.

Advertisement

గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలరా అని చాలామంది అనుమానపడ్డారని, కానీ ప్రజలు, పరిశ్రమలు నేడు ఏపీని విశ్వసిస్తున్నాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును కూడా మరువలేనిదని కొనియాడారు. లేబర్ కోడ్ మార్గదర్శకాల విషయంలో కేంద్రం ఏపీని సంప్రదించడం మన పనితీరుకు నిదర్శనమని, ఇకపై ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇది రాష్ట్రానికి గర్వకారణం: నారా లోకేశ్

 ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ కుటుంబానికే కాకుండా, యావత్ ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. “అత్యంత స్పష్టత, ధైర్యం, నిలకడతో భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని తీర్చిదిద్దిన కొద్దిమంది నాయకులలో చంద్రబాబు ఒకరు. సంస్కరణలు, వేగం, పాలనలో విశ్వసనీయతపై ఆయనకున్న అచంచలమైన దీక్షకు ఈ అవార్డు నిదర్శనం” అని లోకేశ్ కొనియాడారు.

Advertisement

Read Also: YS Jagan : జగన్ పాలన ఎలా ఉండేదో అప్పుడే మరిచిపోయారా? ఆ భారం బాబు చేతుల్లో!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×