E-Paper
Advertisement

Telangana Politics: మీ హయాంలో ఏం జరిగిందో తెలీదా? కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్

Telangana Politics: మీ హయాంలో ఏం జరిగిందో తెలీదా? కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్
Advertisement

Telangana Politics: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసినా అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. కీలక నేతలు చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్

Advertisement

పంచాయతీ ఎన్నికల్లో జడ్చర్ల ఎమ్మెల్యే సర్పంచులను చంపేస్తారని కేటీఆర్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్‌లను ఎప్పుడో చంపేశారన్నారు. ఒక సర్పంచ్ కైనా చేసిన పనులకు బిల్లు ఇచ్చారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

ఇరిగేషన్ కాంట్రాక్టులకు మాత్రం రెగ్యులర్‌గా బిల్స్ పాస్ చేయడం వెనుక మతలబు ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్పంచులకు పెండింగ్ బిల్లులను క్లియర్ చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో చాలామంది సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గుర్తు లేవా అంటూ ధ్వజమెత్తారు. తన మాటలను మీరు వక్రీకరిస్తున్నారని అన్నారు.

Advertisement

ఆనాడు మీరు చేసిందేంటి? గుర్తులేదా?

కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే చనిపోతానని వీడియో రిలీజ్ చేసిన విషయం గుర్తు లేదా? సర్పంచ్ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అయ్యిందన్నారు. మమ్మల్ని గెలిపించకపోతే చనిపోతామని కాళ్లు మోక్కిందెవరని నిలదీశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నందుకే తాను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు.

ఇండిపెండెంట్‌గా గెలిచిన వారిని సోషల్ మీడియాలో మీ అభ్యర్థులుగా చెప్పుకోలేదా?ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ కమిటి ద్వారానే ఇస్తామని తెలిపారు. ఓడిపోయినా సరే మా సర్పంచ్ అభ్యర్థులకు తాను అండగా ఉంటానన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్‌లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఈ లొల్లి ఏంటంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందోనని ఇంకొందరు నేతల మాట.

ALSO READ: వెదర్ బాంబు.. సింగల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×