E-Paper
Advertisement

CM Chandrababu enter in assembly: శపథం నెరవేరింది, రెండున్నరేళ్ల తర్వాత సభలో సీఎం చంద్రబాబు, వైసీపీకి మినహాయింపు

CM Chandrababu enter in assembly: శపథం నెరవేరింది, రెండున్నరేళ్ల తర్వాత సభలో సీఎం చంద్రబాబు, వైసీపీకి మినహాయింపు
Advertisement

CM Chandrababu enter in assembly: రాజకీయ నేతలు శపథాలు చేయడం, సవాళ్లు విసరడం సాధారణం. దాన్ని నేరవేర్చకోకుంటే నవ్వుల పాలవుతారు. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శపథం నెరవేరింది.

దాదాపు రెండున్నరేళ్ల తర్వాత శుక్రవారం ఆయన ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీ ప్రధాన ద్వారానికి నమస్కరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లోపలికి వెళ్లారు. రెండున్నరేళ్ల కిందటి ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్తే..

Advertisement

సరిగ్గా 2021 ఏడాది నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, సభలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఓ శపథం చేశారు. కౌరవసభను గౌరవ సభగా మార్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు. అక్షరాలా దాన్ని ఆయన నిజం చేస్తూ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ALSO READ: ఆ ఐఏఎస్ అధికారి పశ్చాత్తాపం, ఎవరినీ అవమానించలేదు..

Advertisement

అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా పసుపు చొక్కాల రావడంతో అసెంబ్లీ అంతా పసుపుమయంగా మారింది.

జగన్‌కు మినహాయింపు ఇచ్చిన అధికార పార్టీ

అసెంబ్లీ సమావేశాలకు ముందు వైసీపీ అభ్యర్థనను అధికార టీడీపీ ఓకే చేసింది. తొలుత సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌కు ఛాన్స్ ఇవ్వాలని కోరింది. అంతేకాదు జగన్ కారును లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనను సీఎం చంద్రబాబు సానుకూలం గా స్పందించారు. ఇదే విషయాన్ని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యవుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఓకే చెప్పడంతో ఈ రోజు మాత్రమే జగన్ కారు అసెంబ్లీ లోపలికి అనుమతించారు.

 

 

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×