E-Paper
Advertisement

సీఎం చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్స్.. వైసీపీని టార్గెట్ చేస్తూ, బోథ్ ఆర్ నాట్ సేమ్

సీఎం చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్స్.. వైసీపీని టార్గెట్ చేస్తూ, బోథ్ ఆర్ నాట్ సేమ్
Advertisement

TDP Mahanadu: సీఎం చంద్రబాబు రూటు మార్చారా? ఏ సభలు జరిగినా సినిమా డైలాగ్స్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారా? మొన్న పవన్ కల్యాణ్, ప్రభాస్ డైలాగ్స్ కాగా, ఇప్పుడు బాలకృష్ణ సినిమా డైలాగ్స్ వంతైంది. ఇంతకీ సీఎం చంద్రబాబు ఏమన్నారు? ఎవర్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

సీఎం చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్స్

Advertisement

బుధవారం మంగళగిరి టీడీపీ ఆఫీసులోని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని, వీటిని ఆదిలోనే అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. మహానాడు అనే పసుపు పండుగ ఉత్సాహాన్ని డైవర్ట్ చేయాలని ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారని, వారెన్ని కుయుక్తులు పన్నినా డైవర్ట్ చేయలేరని తేల్చేశారు.

ఇది క్రూయల్ మెంటాలిటీ-నేరచరిత్రకు ఉదాహరణగా  ప్రస్తావించారు ముఖ్యమంత్రి.  గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వాళ్ల నైజం ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలన్నారు. పేదలకు పథకాలు, యువతకు ఉద్యోగాలు కావాలన్నారు. గొడ్డలి వేటు కాదని, జంతు బలులతో రక్తాభిషేకాలు కావన్నారు.

Advertisement

మహానాడులో వైసీపీని ఏకి పారేసిన సీఎం చంద్రబాబు

రక్త చరిత్ర రాసేవాళ్లు.. స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరని తేల్చేశారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ల విధానమని, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానమన్నారు. ఈ రెండూ బోథ్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలకృష్ణ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేశారు ముఖ్యమంత్రి.

టీడీపీ అనేది నాయకులను తయారు చేసే యూనివర్సిటీ అని అన్నారు.ఇక్కడ చదివిన వారే వేరే ప్రాంతాల్లో, వేరే పార్టీల్లో రాణిస్తున్నారు తప్ప మరొకటి కాదన్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా అనేది అందరికీ న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతంగా చెప్పారు.  ఇలా సీఎం చంద్రబాబు సినిమా డైలాగ్స్ గతంలో కూడా చెప్పారు. పోయినవారం నెల్లూరు జిల్లాలో ఓ సభలో పవన్ కల్యాణ్, ప్రభాస్ డైలాగ్స్‌ చెప్పిన విషయం తెల్సిందే.

ALSO READ: పుష్కర కాలం తర్వాత మౌనం వీడాను.. మీ గురించి చిట్టా విప్పితే, తట్టుకోలేరన్న పవన్ 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×