E-Paper
Advertisement

గేమింగ్ మానిటర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ డబ్బు వేస్టే!

గేమింగ్ మానిటర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ డబ్బు వేస్టే!
Advertisement

How to Choose a Gaming Monitor: ప్రస్తుత కాలంలో గేమింగ్ పట్ల యువతలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే.. కేవలం పవర్‌ఫుల్ సీపీయూ లేదా గ్రాఫిక్స్ కార్డ్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా సరైన గేమింగ్ మానిటర్ (Gaming Monitor) కూడా ఉండాలి. మార్కెట్లో వేలాది ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పుడు మీ అవసరాలకు సరిపోయే పర్‌ఫెక్ట్ మానిటర్‌ను ఎలా ఎంచుకోవాలో తెలియక చాలా మంది తప్పులు చేస్తుంటారు. అందుకే గేమింగ్ మానిటర్ కొనే ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన, అతి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గేమింగ్ మానిటర్ కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

Advertisement

1. డిస్‌ప్లే: 

గేమింగ్ మానిటర్‌ను ఎంచుకునేటప్పుడు ముందుగా గమనించాల్సింది స్క్రీన్ రిజల్యూషన్ , డిస్‌ప్లే సైజ్. సాధారణంగా గేమింగ్‌కు 24 ఇంచుల నుంచి 27 ఇంచుల సైజ్ చాలా పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. రిజల్యూషన్ విషయానికి వస్తే బడ్జెట్ గేమర్స్ కోసం 1080p సరిపోతుంది. కానీ మరింత స్పష్టమైన విజువల్స్ కోసం 1440p లేదా 4K వైపు వెళ్ళడం మంచిది. అయితే 4K రిజల్యూషన్‌లో గేమింగ్ ఆడాలంటే మీ వద్ద అంతే పవర్‌ఫుల్ గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఉండాలని గుర్తుంచుకోవాలి. మానిటర్ సైజ్ పెద్దదైన కొద్దీ పిక్సెల్ డెన్సిటీ బాగుండాలి. లేదంటే గేమింగ్ ఆడేటప్పుడు గ్రాఫిక్స్ బ్లర్‌గా కనిపించే అవకాశం ఉంది.

Advertisement

2. రిఫ్రెష్ రేట్:

మరొక అత్యంత కీలకమైన ఫీచర్ రిఫ్రెష్ రేట్ , రెస్పాన్స్ టైమ్. రిఫ్రెష్ రేట్ అంటే స్క్రీన్ ఒక సెకనుకు ఎన్ని సార్లు ఇమేజ్‌ను అప్‌డేట్ చేస్తుందో తెలియజేస్తుంది. సాధారణ ఆఫీస్ మానిటర్లు 60Hz కలిగి ఉంటే.. గేమింగ్ మానిటర్లు కనీసం 144Hz లేదా అంతకంటే ఎక్కువ (180Hz, 240Hz) ఉండాలి. రిఫ్రెష్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే గేమ్‌ప్లే అంత స్మూత్‌గా ఉంటుంది. దీంతో పాటు రెస్పాన్స్ టైమ్ ఎల్లప్పుడూ 1ms (మిల్లీసెకండ్) లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది స్క్రీన్‌పై పిక్సెల్స్ ఒక రంగు నుంచి మరొక రంగుకు ఎంత వేగంగా మారుతున్నాయో నిర్ణయిస్తుంది. తక్కువ రెస్పాన్స్ టైమ్ ఉండటం వల్ల ఫాస్ట్-పేస్డ్ షూటింగ్ గేమ్స్ ఆడేటప్పుడు ‘ఘోస్టింగ్’ లేదా మోషన్ బ్లర్ వంటి సమస్యలు రావు.

3.ఓఎల్ఈడీ ప్యానెల్స్:

డిస్‌ప్లే ప్యానెల్ రకం కూడా మీ గేమింగ్ ఫీల్ పూర్తిగా ప్రభావితం చేస్తుంది. మార్కెట్లో ప్రధానంగా టీఎన్ (TN), వీఏ (VA), ఐపీఎస్ (IPS) ప్యానెల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ప్రీమియం విభాగంలో ఓఎల్ఈడీ ప్యానెల్స్ ట్రెండ్ అవుతున్నాయి. బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ కలర్ అక్యూరసీ , అద్భుతమైన వ్యూయింగ్ యాంగిల్స్ కావాలనుకునే వారికి.. ఐపీఎస్ (IPS) ప్యానెల్స్ ఈరోజుల్లో బెస్ట్ ఛాయిస్‌గా మారాయి. డార్క్ సీన్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ ఆడేవారికి వీఏ ప్యానెల్స్ మంచి కాంట్రాస్ట్ రేషియోను ఇస్తాయి. మీ బడ్జెట్ ఎక్కువగా ఉండి, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ , ఇన్స్టంట్ రెస్పాన్స్ టైమ్ కావాలనుకుంటే ఓఎల్ఈడీ మానిటర్లను ఎంచుకోవచ్చు.

Also Read: ఫ్యాబ్రిక్‌ను బట్టి వాషింగ్,ఎల్‌జీ వాషింగ్ మెషీన్‌‌లో.. ఇవేం ఫీచర్లు బాబోయ్

చివరగా.. స్క్రీన్ టియరింగ్ సమస్యను నివారించడానికి మానిటర్‌లో అడాప్టివ్ సింక్ టెక్నాలజీ ఉందో లేదో చూసుకోవాలి. ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్ వాడేవారు ‘జీ-సింక్’ (G-Sync), ఏఎమ్‌డీ కార్డ్ వాడేవారు ‘ఫ్రీ-సింక్’ సపోర్ట్ ఉన్న మానిటర్లను ఎంచుకోవాలి. అలాగే మీ పీసీ లేదా పీఎస్5 లాంటి కన్సోల్‌ను కనెక్ట్ చేయడానికి డిస్‌ప్లే పోర్ట్ 1.4 లేదా హెచ్‌డిఎమ్‌ఐ 2.1 పోర్టులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం బెటర్. బ్రాండ్ వారంటీ , ఎర్గోనామిక్ స్టాండ్ (హైట్ అడ్జస్ట్‌మెంట్) ఉన్న మానిటర్లను ఎంచుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా గేమింగ్ ఆస్వాదించవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×