E-Paper
Advertisement

ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు

ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు
Advertisement

Ambati Rambabu: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన AI వీడియో వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వివాదాస్పద వీడియోను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

డీజీపీ కార్యాలయంలో టీడీపీ నేతల ఫిర్యాదు

Advertisement

మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యానీ నేతృత్వంలోని టీడీపీ బృందం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఈ వ్యవహారంపై రాతపూర్వక ఫిర్యాదు అందించింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టను దిగజార్చేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతోనే ఈ ఏఐ టెక్నాలజీ ఆధారిత వీడియోను సృష్టించి ప్రచారం చేశారని వారు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. నాయకుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ తరహా పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి సీఐడీ.. దర్యాప్తు ప్రారంభం

Advertisement

మద్దిరాల మ్యానీ ఇచ్చిన ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించిన సీఐడీ అధికారులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ఈ వీడియోను ఎవరు తయారు చేశారు, దీని వెనుక ఉన్న సాంకేతిక సహకారం ఎవరిది, ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్ముందు ఈ కేసులో డిజిటల్ ఆధారాలను సేకరించి మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Also Read: ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×