E-Paper
Advertisement

టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!

టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!
Advertisement

Ramayana Teaser: భారీ సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో రివ్యూలు మొదలైపోతున్నాయి. రెండు నిమిషాల టీజర్ చూసి “హిట్”, “ఫ్లాప్”, “ఇది అసలు వర్కౌట్ కాదు” అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇదిగో లేటెస్ట్ గా వచ్చిన రామాయణం టీజర్ కీ ఇపుడు అదే పరిస్థితి.

నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తాజాగా వచ్చిన టీజర్‌పై శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది విమర్శలు చేశారు. క్యాస్టింగ్ బాగోలేదని, వీఎఫ్‌ఎక్స్ అంత గొప్పగా లేవని, కాస్ట్యూమ్స్ కూడా సెట్ కాలేదని, మ్యూజిక్ కూడా ఇంకా బెటర్‌గా ఉండాల్సిందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు.. “దూరదర్శన్‌లో వచ్చిన రామాయణమే ఎప్పటికీ బెస్ట్” అని కూడా అన్నారు.

Advertisement

ఎలా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు?

అయితే ఆమె కామెంట్లపై మరోవైపు నెటిజన్లు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు.”అసలు సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. టీజర్ చూసి ఎలా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు?”,”రెండు నిమిషాల వీడియో చూసి మూడు గంటల సినిమా ఎలా చెప్పేస్తారు?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

నిజానికి ప్రతి పెద్ద సినిమాకి ఇదే జరుగుతోంది. టీజర్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో రెండు టీమ్స్ డివైడ్ అయిపోతున్నాయ్.ఒకరు సూపర్ అంటారు.. ఇంకొకరు డిజాస్టర్ అంటారు. చివరికి సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం చాలాసార్లు లెక్కలన్నీ మారిపోతాయి.

also read :మహేష్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

ఆ పాత్రను కావాలనే సస్పెన్స్‌లో పెట్టారా?

ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. వీళ్ల లుక్స్‌పై కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరికి కొత్తగా అనిపిస్తే..  పాత రామాయణం స్టైల్ మిస్ అయిందనేది మరికొందరి  ఫీలింగ్ .

మరోవైపు టీజర్‌లో హనుమంతుడి పాత్రలో నటిస్తున్న సన్నీ డియోల్ కనిపించకపోవడం కూడా చర్చగా మారింది. “ఆ పాత్రను కావాలనే సస్పెన్స్‌లో పెట్టారా?” అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

గతంలో కూడా చాలాసినిమాల విషయంలో ఇలానే జరిగింది. ట్రైలర్ చూసి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొట్టాయి. అలాగే ట్రైలర్ అదిరిపోయిందనుకున్న కొన్ని సినిమాలు రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే టీజర్ ఒక్కటే చూసి సినిమా గురించి ఫుల్ తీర్పు ఇవ్వడం కాస్త తొందరపాటే అని సినీ అభిమానులు అంటున్నారు.

ఇంకెన్ని కామెంట్స్ కత్తుల్లా దూసుకువస్తాయో?

ప్రస్తుతం ‘రామాయణం’ టీజర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శలు రెండూ కనిపిస్తున్నాయి. కానీ అసలు సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే ఎవరి మాట కరెక్టో తెలుస్తుంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో కామెంట్లు, ట్రోల్స్, ఫ్యాన్ వార్స్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు మరి.చూడాలి ముందు ముందు ఇంకెన్ని కామెంట్స్ కత్తుల్లా దూసుకువస్తాయో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×