E-Paper
Advertisement

Chandrababu : కుప్పం స్థాయిని మరో సారి చాటి చెప్పాలి.. చంద్రబాబు పిలుపు..

Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవకర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి బస్టాండ్‌ కూడలి వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

Chandrababu : కుప్పం స్థాయిని మరో సారి చాటి చెప్పాలి.. చంద్రబాబు పిలుపు..
Advertisement

Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవకర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి బస్టాండ్‌ కూడలి వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పేదలకు భోజనం వడ్డించారు.

ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నానన్నారు. 35 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్‌ ఏర్పాటు చేస్తానని బాబు వెల్లడించారు. లక్ష మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలన్నారు. వైసీపీ నేతలు హద్దుమీరి అరాచకాలు చేస్తున్నారన్నారు. సైకోతో పోరాడాల్సి రావడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

సంస్కృతిని గుర్తు పెట్టుకొని భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. కురబ వర్గంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీ రంగంలో కురబ వర్గానికి చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారన్నారు. కురబలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తనపైన ఉందన్నారు. గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తామన్నారు. ఎప్పుడూ మన మూలాలను మరచిపోకూడదన్నారు. వైసీపీ నాయకులు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×