E-Paper
Advertisement

Chandrababu :నా జీవిత ఆశయం ఇదే.. చంద్రబాబు ఆశ అదే..

Chandrababu :నా జీవిత ఆశయం ఇదే.. చంద్రబాబు ఆశ అదే..
Advertisement
chandrababu

Chandrababu : గోదావరి జలాల్ని రాయలసీమకు చేర్చడమే తన జీవిత ఆశయం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన చంద్రబాబు.. టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని చెప్పారు. ఇప్పుడు అనంతపురం వస్తున్న నీళ్లు పట్టిసీమవే అని తెలిపారు. హంద్రీనీవా ఫేజ్‌-2లో బుక్కపట్నం రిజర్వాయర్ పూర్తి చేశామని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం కాలువలు తవ్వలేదని మండిపడ్డారు.

Advertisement

ఒక మూర్కుడు, ఒక అజ్ఞాని అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో జగన్‌ను చూస్తే అర్థం అవుతోందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వైసీపీకి పోయే టైమ్‌ దగ్గర పడిందని.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే 365 GO ద్వారా రాయలసీమలో 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టి.. పోలీసులు చిక్కుల్లో పడొద్దని హితవు పలికారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×