E-Paper
Advertisement

మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!

మమ్మల్ని తిట్టే సోషల్ మీడియా గ్రూపులకు ‘గొడ్డలి పార్టీ’ ఫండింగ్.. చంద్రబాబు సంచలనం!
Advertisement

Chandrababu Naidu: అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేక, ప్రతిపక్షం కుట్రలకు తెరలేపుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు.

సోషల్ మీడియా ఫండింగ్‌పై సంచలన ఆరోపణలు

Advertisement

ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రత్యర్థులు పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అందుకోసం కొన్ని సోషల్ మీడియా విభాగాలకు ప్రత్యేకంగా నిధులు (ఫండింగ్) అందుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలు చేయించడమే పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వాస్తవాలతో సంబంధం లేకపోయినా, పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హింస, ఫ్యాక్షన్ రాజకీయాలే వారి నైజం

Advertisement

గత పాలకుల వైఖరి వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి కేవలం హింస, బూతులు, ఫ్యాక్షన్ రాజకీయాలు మాత్రమే తెలుసని, వాటినే వారు నమ్ముకున్నారని విమర్శించారు. ‘రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమేయడం, కొత్త పెట్టుబడులను అడ్డుకోవడమే గత ప్రభుత్వ ప్రధాన విధానంగా సాగింది. కానీ, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి తెస్తున్న ప్రాజెక్టులను కూడా తామే తెచ్చామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read: పదవులు ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గెలుపే నా లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి

తిరుమల ప్రసాదం, గంజాయి సాగుపై ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర చర్యలతో కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, అలాంటి వారు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే, ఏజెన్సీ ప్రాంతాలను గత పాలకులు గంజాయి సాగుకు, అక్రమ రవాణాకు కేంద్రాలుగా మార్చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతూ, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×