E-Paper
Advertisement

ఏకంగా 9000mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్‌తో కొత్త సిరీస్.. ఫీచర్లు లీక్!

ఏకంగా 9000mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్‌తో కొత్త సిరీస్.. ఫీచర్లు లీక్!
Advertisement

OnePlus Ace 7: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు వన్‌ప్లస్ అదిరిపోయే న్యూస్ చెప్పబోతోంది. తమ సరికొత్త OnePlus Ace 7 సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవున్నాయి. ఇందులో స్టాండర్డ్ వన్‌ప్లస్ ఏస్ 7తో పాటు ప్రీమియం మోడల్ వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

ఈ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్లను వన్‌ప్లస్ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లతో టెస్ట్ చేస్తోంది. హెవీ టాస్క్‌లు, గేమింగ్ వంటి వాటిని చాలా సులువుగా హ్యాండిల్ చేయడానికి వీలుగా ఒక మోడల్‌లో లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను, మరో మోడల్‌లో కస్టమైజ్డ్ వెర్షన్‌ను వాడుతున్నట్లు సమాచారం. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతోంది.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్:

Advertisement

ఈ ఫోన్ లీక్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం దీని బ్యాటరీ కెపాసిటీ. వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్‌లో ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు టాక్. వన్‌ప్లస్ చరిత్రలోనే ఇది అతిపెద్ద బ్యాటరీ కానుంది. ఇంత పెద్ద బ్యాటరీని క్షణాల్లో ఛార్జ్ చేయడం కోసం 100W లేదా 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు.

Also Read: Google Pixel 10పై భారీ ధర తగ్గింపు.. ఆఫర్ ధరెంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

అదిరిపోయే కూలింగ్ టెక్నాలజీ:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్లలో 6.78 ఇంచుల ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇది 1.5K రిజల్యూషన్, అల్ట్రా స్మూత్ 185Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. దీనివల్ల స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం గేమింగ్ ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు దీనిలో యాక్టివ్ ఫ్యాన్ కూలింగ్ టెక్నాలజీని కూడా టెస్ట్ చేస్తున్నారు.

నెక్ట్స్ లెవల్ కెమెరా ఫీచర్లు:

కెమెరా పరంగా కూడా ఈ సిరీస్ అప్‌గ్రేడ్ కానుంది. ముఖ్యంగా ఏస్ 7 ప్రో మోడల్‌లో శాంసంగ్ JN5 సెన్సార్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించవచ్చని తెలుస్తోంది. ఇది 3.5x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో సుదూరంగా ఉన్న వస్తువులను కూడా చాలా స్పష్టంగా ఫొటోలు తీయొచ్చు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రోటోటైప్ స్టేజ్‌లోనే ఉన్నందున, లాంచ్ సమయానికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.

Also Read: రెడ్ కలర్‌లో Nothing సరికొత్త ఫోన్.. RCB లోగోతో క్రేజీ లుక్.. ఆ ఒక్క స్టోర్‌లోనే లభ్యం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×