E-Paper
Advertisement

Chandrababu : 70 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా? జనసేన ఫస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్..!

Chandrababu : ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికారమే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి పావులు కదుపుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జల ప్రకటిస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచారు. అప్పటి నుంచి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ టిక్కెట్ దక్కని నేతలు పార్టీకి గుడ్ చెప్పేస్తున్నారు. జగన్ అత్యంత సన్నిహితులైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా వైసీపీని వీడారు. గెలిచే ఛాన్స్ లేదంటే ఎలాంటి నేతనైనా జగన్ పక్కన పెట్టేస్తున్నారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం
రా కదలిరా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్‌లో నేటి నుంచి పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. వారితో ఫస్ట్‌ లిస్టుపై మంతనాలు జరపనున్నారు.

Advertisement

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న టీడీపీ 70 మంది క్యాండిడేట్స్ తో మొదటి జాబితా విడుదల చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. అటు జనసేన కూడా 15 మందితో ఫస్ట్‌ లిస్టు రిలీజ్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ప్రచార వ్యూహాన్ని చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29 తర్వాత అమరావతిలో సభ నిర్వహించేందుకు పథక రచన చేస్తున్నారు. ఆ సభా వేదికపై 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారని తెలుస్తోంది.ఆ లోపే తొలిజాబితా విడుదల చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×