E-Paper
Advertisement

Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. తిరుమలలో దివ్వెల మాధురి న్యూసెన్స్ రీల్స్.. కేసు నమోదు

Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. తిరుమలలో దివ్వెల మాధురి న్యూసెన్స్ రీల్స్.. కేసు నమోదు
Advertisement

Case registered against Divvela Madhuri in Tirumala: వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని సన్నిధిలో శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయంలో ఫొటో షూట్ చేశారు.

అలాగే పవిత్రమైన తిరుమల మాడవీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేసింది ఫిర్యాదులు అందాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత బంధాల గురించి మాట్లాడారని ఆరోపించారు. ఈ కారణాలతో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు.

Advertisement

దీంతో దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్‌పై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వ్యవహరించారని 292, 296, 300 బీఎన్ఎస్, సెక్షన్66(ఈ) ఏటీ యాక్ట్, 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా దివ్వెల మాధురికి సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ సతీమణి వాణి సైతం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: కొంపముంచిన రాసలీలల వీడియో.. ఇద్దరు కీలక నేతల రాజీనామా!

అయితే, ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు ఫొటో షూట్ తెలిసి కావాలనే చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటివి తిరుమల కొండపై నిషేధమని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

భక్తితో మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలని, అనవసర విధానాలపై ధ్యాస వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఒక ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్.. శ్రీవారి సన్నిధిలో ఇలాంటివి చేయ్యకూడదని చెప్పడం తెలియదా అంటున్నారు. ఇవేమి తెలియకుండా.. అతనే దగ్గరుండి రీల్స్, ఫొటోలు తీయించడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×