E-Paper
Advertisement

Tirumala Accident: బ్రేక్ ఫెయిల్.. తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా

Tirumala Accident: బ్రేక్ ఫెయిల్..  తిరుమల ఘాట్ రోడ్డులో  కారు బోల్తా
Advertisement

Tirumala Accident: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం ఓ కారు బోల్తా పడింది. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో కారు పల్టీలు కొట్టింది.  ఈ ఘటనలో అందులోని భక్తులకు స్వల్పగాయాలు అయ్యాయి. కారులోని ఉన్నవారంతా సేఫ్‌గానే బయటపడ్డారు. అసలు ఎలా జరిగింది?

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా

Advertisement

సోమవారం ఉదయం తిరుమల కొండపై నుంచి తిరుపతికి ఓ కారు వస్తోంది. అయితే మొదటి ఘాట్ రోడ్డులో ఆ కారు బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి. దీంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఆ తర్వాత బోల్తా పడింది. అయితే నాలుగైదు పల్టీలు కొట్టినట్టు చెబుతున్నారు.

ఈ ఘటనలో నలుగురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటన సమయంలో కారుకి ముందు వెనుక వాహనాలు లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పిందని అంటున్నారు. కారు రోడ్డుకు అడ్డంగా బోల్తాపడడంతో తిరుమల వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

బ్రేక్ ఫెయిల్ కావడంతో, భక్తులు సేఫ్

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే కారుని తిరుపతికి తరలించారు అధికారులు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ క్లియర్ చేశారు. కారులో ఉన్నవారంతా తమిళనాడుకి చెందిన భక్తులు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: తొలివిడత 20 మంది నేతలు, జగన్ సీరియస్ వార్నింగ్

ఈ మధ్యకాలంలో తిరుమల ఘాట్ రోడ్డులో ప్రైవేటు వాహనాలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  అతివేగంగా వెళ్లేవారు కొందరైతే, అనుకోకుండా మరికొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు జాగ్రత్తగా, నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×