E-Paper
Advertisement

CM Chandrababu: భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు

CM Chandrababu: భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం.. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తికానుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది

“18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భోగాపురం ఎయిర్ పోర్టు ఆ ప్రాంత కనెక్టివిటీ పెంచి అభివృద్దికి దోహద పడుతుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ….ఈ సందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” -సీఎం చంద్రబాబు

తొలి విమానం ల్యాండ్

Advertisement

మరికొన్ని రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్ పోర్టులో ఆదివారం తొలి విమానం ల్యాండ్‌ అయింది. వ్యాలిడేషన్‌ టెస్ట్ లో భాగంగా తొలి ఫ్లైట్‌ దిల్లీ నుంచి భోగాపురానికి చేరుకుంది. ఈ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్‌, అధికారులు ఉన్నారు. అత్యాధునిక సాంకేతికతో భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు. 96 శాతం పనులు పూర్తి అయినట్లు జీఎంఆర్‌ సంస్థ పేర్కొంది. జూన్‌ 26,2026న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Also Read: భోగాపురంపై ప్రాణం పెట్టిన టీడీపీ.. కాదు కాదు ఆ ఘనత మాదే!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×