E-Paper
Advertisement

Aviation Embraer: యూనిట్ కోసం ఎంబ్రేర్ చూపు.. భోగాపురంపై పరిశీలన, గేమ్‌ఛేంజర్ కాబోతుందా?

Aviation Embraer: యూనిట్ కోసం ఎంబ్రేర్ చూపు.. భోగాపురంపై పరిశీలన, గేమ్‌ఛేంజర్ కాబోతుందా?
Advertisement

Aviation Embraer: దేశంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్ ఛేంజర్‌గా మారుతుందా? ఏరో సిటీ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయా? ప్రపంచంలో విమానాల తయారీ కంపెనీ ఎంబ్రేర్ చూపు ఇండియాపై పడిందా? భోగాపురంతోపాటు ధోలేరా ప్రాంతాన్ని ఎంచుకోనుందా? ఏదో ఒకటి ఫైనల్ కానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

యూనిట్ ఏర్పాటుకు ఎంబ్రేర్ కంపెనీ చూపు

Advertisement

బ్రెజిలియన్ ఏవియేషన్ దిగ్గజం ఎంబ్రేర్ కంపెనీ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. వాణిజ్య విమానాల విభాగంలో అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం అదానీ గ్రూప్‌తో ఆ కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లోని ధోలేరా, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఈ పెట్టుబడికి ప్రధాన పోటీదారులుగా మారుతున్నట్లు సమాచారం.

ఈ రెండు ప్రాంతాల్లో ఒక చోట ఆ కంపెనీ యూనిట్ ఏర్పాటు చేయడం ఖాయం. పెట్టుబడి ఎంత పెట్టనుంది? తయారీ సామర్థ్యం, ఏ ప్రాంతం వంటివి ఇంకా ఖరారు కాలేదు. ప్రాజెక్ట్ పరిధి, నిర్మాణంపై ఇరుపక్షాలు చర్చల తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. దీనివల్ల పారిశ్రామిక సామర్థ్యాలను పెంచడమేకాదు, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు రాబోతున్నాయి.

Advertisement

రేసులో ధోలేరా, భోగాపురం  ప్రాంతాల పరిశీలన

ఆ కంపెనీ E1, E2 కమర్షియల్ జెట్‌ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. ఎంబ్రేర్ ప్రస్తుతం బ్రెజిల్‌లో E-జెట్‌లను తయారు చేస్తుంది. అంతేకాదు వివిధ దేశాల నుంచి ఆర్డర్స్‌ని సొంతం చేసుకుంది. ఆ కంపెనీ విమానాల విడి భాగాలను అవుట్ సోర్సింగ్ చేయడానికి భారత్‌లో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.  గత అక్టోబర్‌లో మహీంద్రా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ పరిశ్రమ కోసం తాము ఆసక్తిగా ఉన్నామని, భోగాపురం రేసులో ఉందని మంత్రి లోకేష్ ఇటీవల నేషనల్ మీడియాతో అన్నట్లు తెలుస్తోంది. భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు సమీపంలో జీఎంఆర్‌-మానసాస్ ఏవియేషన్ సంయుక్తంగా ఎడ్యు సిటీ ఏర్పాటు చేయబోతున్నాయి. విద్య, పరిశ్రమలను అనుసంధానించేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏరో స్పేస్, MROకు హబ్‌గా నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ALSO READ: పల్నాడులో వైసీపీ కార్యకర్త హత్యపై జగన్ ఫైర్

విమానాల నిర్వహణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏరోస్పేస్ వంటి కోర్సులు ఉండనున్నాయి. విమానరంగంలో ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది అంతర్జాతీయంగా పేరుగాంచిన యూనివర్సిటీల బ్రాంచ్‌ క్యాంపస్‌లు వచ్చేలా చేస్తోంది. అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌ సెంటర్లు, అప్లయిడ్‌ టెక్నాలజీ‌పై దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో ఎంబ్రేర్ కంపెనీ ఎటువైపు చూపుతుందో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×