E-Paper
Advertisement

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?
Advertisement

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దీంతో ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం వ్యాపారంలో భారీగా మనీలాండరింగ్, హవాలా సొమ్ము చేతులు మారినట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

రాజ్ కసిరెడ్డి అరెస్టుకు ముందు ఈడీ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి నివాసం, ఆయనకు చెందిన కార్యాలయాలు, అలాగే ఈ స్కామ్‌తో సంబంధం ఉందనే అనుమానం ఉన్న మరికొందరు ముఖ్యుల ఇళ్లల్లో ఈడీ బృందాలు గాలించాయి. ఈ సోదాల్లో లభించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాల బేస్‌గా రాజ్ కసిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు.

Advertisement

అనంతరం వైద్య చికిత్స నిమిత్తం ఈడీ కార్యాలయం నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈడీ కోర్టులోనూ ఆయన్ను ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కసిరెడ్డిని కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరనున్నారు. ఈడీ కోర్టు అనుమతి లభించిన వెంటనే మద్యం అక్రమ రవాణా, నిధుల మళ్లింపుపై ఆయన్ను సుదీర్ఘంగా ఈడీ ప్రశ్నించనుంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు తిమింగలాల గుట్టు విప్పేందుకు ఈ విచారణ అత్యంత కీలకం కానుంది.

Also Read: Smart Gadgets: ఇల్లు మీది.. పని వాటిది.. మీ శ్రమను తగ్గించే 5 స్మార్ట్ గ్యాడ్జెట్స్!

Advertisement

అయితే ఈ లిక్కర్ స్కామ్‌పై విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే లోతుగా విచారణ జరిపి నాలుగు వేర్వేరు ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది. తాజాగా ఈడీ రంగంలోకి దిగడం, రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేయడంతో.. త్వరలోనే ఈ కేసులో తుది ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాజ్ కసిరెడ్డి అరెస్టు నేపథ్యంలో అందరి దృష్టి సహజంగానే మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మీదకు మళ్లింది. రాజ్ కసిరెడ్డి ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా జగన్ కి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

Also Read: మీ ఫోన్ వర్షంలో తడిసిందా? ఈ 5 తప్పులు చేస్తే.. ఇక అంతే సంగతులు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×