E-Paper
Advertisement

ఓడిన‌ప్పుడే మ‌ళ్లీ టీఆరెస్‌గా మార్చుకోమంటే విన్నారా? ఇప్పుడెందుకు పాకులాట‌!?

ఓడిన‌ప్పుడే మ‌ళ్లీ టీఆరెస్‌గా మార్చుకోమంటే విన్నారా? ఇప్పుడెందుకు పాకులాట‌!?
Advertisement

బాపు ఒక్క‌సారి డిసైడ్ అయితే అంతే.. ఎవ‌రి మాట విన‌డు. తెలంగాణ ప‌దం తీసేసి భార‌త్ చేర్చేసి.. జాతీయ పార్టీగా మార్చేసి.. నేల విడిచి సాము చేసిన‌ట్టు.. గ‌ల్లీ వ‌దిలి ఢిల్లీ రాజ‌కీయాలు చేద్దామనుకున్నాడు. బాపు ఏది చెబితే జ‌నం అది క‌రెక్ట‌ని త‌ల‌లూపాలి. అట్ల‌నే ఊపుతారనుకున్నాడు. కానీ క‌ర్రుకాల్చి వాత పెట్టారు. అయినా మార‌లేదు బాపు. వెన‌క్కి త‌గ్గితే ఇజ్జ‌త్ పోత‌ద‌నుకున్న‌డు. అందుకే అదిప్పుడు జాతీయ పార్టీ కాదు.. ప్రాంతీయ పార్టీ కాదు.. మ‌ధ్య‌లో పార్టీ అన్న‌మాట‌. అంతా ముద్దుగా టీఆరెస్ అని పిలుచుకున్నా ఓకే అన్న‌మాట‌!

కానీ రోజులెప్పుడు ఒక్క‌లా ఉండ‌యి క‌దా! మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ‌ట్టుగా .. క‌విత బ‌య‌టకొచ్చేసింది. పార్టీ పెట్టింది. ఇక్క‌డ జ‌నం ఏది కోల్పోయ‌మ‌నుకున్నారో.. ఏ విష‌యంలో నిర్ల‌క్ష్య‌మ‌య్యారో.. వాటితోనే ఆమె కొత్త పార్టీకి జీవం పోయాల‌నుకున్న‌ది. అందుకే ఆమె టీఆరెస్ పార్టీ పేరుకే ఎస‌రు పెట్టింది. కింద‌కు నీళ్లొచ్చేదాకా తెల్వ‌దు పాపం.. తండ్రీకొడుకుల‌కు.. క‌విత ఇంత‌పెద్ద ఝ‌ల‌క్ ఇస్తుంద‌ని. అందుకే వ‌ద్దు వ‌ద్దు ప్లీజ్ .. అది మా సెంటిమెంట్‌..మ‌మ్మ‌ల్నింకా టీఆరెస్‌గానే పిలుచుకుంటున్నారు. ఏదో బుద్ది గ‌డ్డి తిని ఇట్ల పేరు మార్చుకున్నం గానీ.. అని జ‌నానికి తెల్వ‌కుండా ఆ ఎన్నిక‌ల క‌మిష‌న్ కాళ్లు మొక్కుడు ఒక్క‌టే త‌క్కువ‌.

Advertisement

మ‌రి అదే మోక‌రిల్లుడు జ‌నం ముందు అప్పుడే మొక‌రిల్లి త‌ప్పు చేసినం.. క్ష‌మించండి.. మీ బంచాన్ కాల్మొక్తా! అంటే స‌గం పాపాలు పోవుక‌దా! తెలంగాణ పేరును పార్టీ పేర్ల‌కెళ్లి తీసేసినం.. త‌ప్పైంది.. ఇగో మ‌ళ్లా పేరు మార్సుకుంటున్న‌మ‌ని చెబితే వాళ్లు చ‌ల్ల‌బడు గ‌దా! అవేమీ చేయ‌లే కానీ ప‌బ్లిక్ మీద‌నే అలిగి ఫామ్‌హౌజ్‌ల పండుకున్న‌డు బాపు! చెరువు మీద అలిగితే ఎవ‌ల‌దెండుత‌ది? పేరు మార్చ‌క‌క‌పోతిరి. బుద్ది మార‌క‌పోయె! అహంకార‌మూ వీడ‌క‌పోతిరి.. తోడ‌బుట్టినదాన్నీ త‌రిమేస్తిరి..! అన్నీ త‌ప్పుల మీద త‌ప్పులేనాయె! చెంప‌లైతే ఏసుకోరు. జ‌న‌మే మిమ్మ‌ల్ని ఓడ‌గొడితిమి అయ్యో అని ఏడ‌వాలె.. త‌ప్పైంద‌ని చెంప‌లేసుకోవాలె!

అంత‌లా మిమ్మ‌ల్ని జ‌నం ఆద‌రిస్తుంటే.. మీకోసం ఎదురుచూస్తుంటే.. మ‌ళ్లా బాపే కావాల‌ని క‌ల‌వ‌రిస్తుంటే.. గా పాత టీఆరెస్ పార్టీ మ‌న‌క‌వ‌స‌ర‌మానే రామ‌న్నా! పోతే పోనీ తియ్‌! మ‌నం ఏం పేరు పెట్టుకున్నా.. స‌రే జ‌నం ఓకే అంట‌రు! చెప్పును నిల‌బెట్టినా ఆడ కేసీఆర్ ముఖం చూసి వాళ్ల‌ను గెలిపిస్త‌రు జ‌నం.. మ‌రి మ‌న‌కెందుకు భ‌యం. సార్ ముఖం చూపిచ్చి క‌దా ఓట్ల‌కు పోతం. మ‌న కారు గుర్తు మ‌న‌కే ఉన్న‌ది క‌దా! అదెవ్వ‌రూ గుంజ‌క‌పోలే క‌దా! ఇంకేం భ‌యం లేదు. మ‌న‌మే మ‌ళ్లా వ‌స్తున్నాం.. పెద్ద‌సారు సీఎం అయి.. వెంట‌నే దిగిపోయి.. నిన్ను సీఎం చేసి.. అదే బీఆరెస్ పార్టీ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పి… ఢిల్లీల కూసుంట‌డు! అప్పుడు ఈ టీఆరెస్ గీఆరెస్‌.. కాంగ్రెస్ గీంగ్రెస్‌..బీజేపీ గీజేపీ అన్నీ త‌లోమూల పోత‌య్‌.. ! చూడు నువ్వు ఇదే జ‌ర‌గ‌బోతుంది…నిజ్జంగా!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×