E-Paper
Advertisement

AP Liquor Case: ఎంపీ మిథున్‌రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు, నాలుగు బృందాలు తనిఖీలు

AP Liquor Case: ఎంపీ మిథున్‌రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు, నాలుగు బృందాలు తనిఖీలు
Advertisement

AP Liquor Case: లిక్కర్ వ్యవహారం వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఓ వైపు నకిలీ మద్యం.. ఇంకోవైపు లిక్కర్ కుంభకోణం దర్యాప్తు సాగుతోంది. రెండు కేసులపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఎప్పుడు  ఏ నేత ఇంటిపై సోదాలు చేస్తోరనని బెంబేలెత్తిపోతున్నారు ఆ పార్టీ నేతలు.

లిక్కర్ స్కామ్‌.. మళ్లీ సిట్ సోదాలు

Advertisement

తాజాగా మంగళవారం ఉదయం లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఇటీవల అరెస్టయిన ఆయన, 71 రోజులకు పైగానే జైలులో ఉన్నారు.  ఇటీవల ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  రేపో మాపో ఆయనకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది సిట్.

తాజాగా తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది సిట్. ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాసన్ నగర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతంలోని గాయత్రీహిల్స్ ఇంట్లోనూ ఈ సోదాలు చేస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నాయి. మిథున్‌రెడ్డి కుటుంబసభ్యులతో పాటు ఆఫీసు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అధికారులు.

Advertisement

తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాల్లో

విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు చేసినట్టు సిట్ వర్గాలు చెబుతున్నాయి. రేపో మాపో ఆయనకు సంబంధించి అదనపు ఛార్జిషీటు దాఖలు చేయనుంది. ఇంతలోనే సోదాలు జరగడంతో మిథున్‌రెడ్డి విషయంలో ఏం జరుగుతోందని ఆపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

ALSO READ: నకిలీ బీరు.. నకిలీ మద్యం, జగనూ నువ్వే చేయించావా?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించిన పీఎల్ఆర్ సంస్థను ఐదు కోట్లు బదిలీ అయినట్టు ఆధారాలు లభించాయట. ఈ క్రమంలో సోదాలు జరిపినట్టు చెబుతున్నారు. మరోవైపు మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ హైకోర్టుని సిట్ ఆశ్రయించింది కూడా. ఈ పరిణామాలు జరుగుతుండగానే సోదాలు చేపట్టడం వైసీపీ నేతల్లో కలకలం మొదలైంది.

మరోవైపు నకిలీ మద్యం కేసుపై సోమవారం సాయంత్రం సిట్ రంగంలోకి దిగింది. ఆ కేసు మరొక సిట్ దర్యాప్తు చేస్తోంది. దీనివెనుక సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అంటూ సోమవారం నిందితుడు బయటపెట్టిన వీడియో వెలుగులోకి వచ్చింది.  ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని సిట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×