E-Paper
Advertisement

AP High Court: భార్యాభర్తల వివాదం.. పిల్లల డీఎన్ఏ టెస్ట్‌, ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

AP High Court:  భార్యాభర్తల వివాదం.. పిల్లల డీఎన్ఏ టెస్ట్‌, ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Advertisement

భార్యాభర్తల వ్యక్తిగత విభేదాల్లోకి పిల్లలను లాగడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన ఇద్దరు పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం నేరుగా తిరస్కరించింది. తల్లిదండ్రుల మధ్య సాగే న్యాయపోరాటంలో పిల్లల గౌరవం హక్కులను కాపాడటం అత్యంత ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.

విడాకుల కేసు విచారణలో భాగంగా భర్త ఈ విన్నపాన్ని కోర్టు ముందు ఉంచారు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని నిరూపించడానికి పిల్లల డీఎన్ఏ పరీక్షలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆ పిల్లలకు తాను తండ్రిని కాదనే నిజాన్ని ఈ పరీక్షలు వెల్లడిస్తాయని వాదించారు. తద్వారా భార్య వ్యభిచారానికి పాల్పడిందనే తన ఆరోపణలకు బలమైన సాక్ష్యం లభిస్తుందని వివరించారు.

Advertisement

ఈ కేసును విచారించిన జస్టిస్ తార్లాడ రాజశేఖరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాహేతర సంబంధాల ఆరోపణలను నిరూపించుకోవడానికి పిల్లలను ఒక సాధనంగా వాడుకోవడం చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ట్రయల్ కోర్టు సైతం ఇదే విన్నపాన్ని తోసిపుచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. భార్యపై ఉన్న ఆరోపణలను ఇతర సాక్ష్యాల ద్వారా నిరూపించుకోవాలే తప్ప పిల్లల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసింది.

భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 112 అంశాన్ని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. చెల్లుబాటు అయ్యే వివాహ బంధంలో పుట్టిన బిడ్డను చట్టబద్ధమైన సంతానంగానే పరిగణించాలని ఈ సెక్షన్ చెబుతోంది. దీనిని కాదని నిరూపించాలంటే అత్యంత బలమైన సాక్ష్యాలు ఉండాలి. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం వల్ల పిల్లల మానసిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో వారి ప్రతిష్టకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించింది.

Advertisement

డీఎన్ఏ పరీక్షల విషయంలో 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం హైకోర్టు ఉదహరించింది. పిల్లల గోప్యతను వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. కేవలం అనుమానాల ఆధారంగా పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టలేమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ALSO READ: Social media: సోషల్ మీడియాపై మోదీ సర్కార్ ఉక్కుపాదం.. ఇక నిమిషాల్లో ఫేక్ వీడియోలు డిలీట్, అదెలా అంటే..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×