E-Paper
Advertisement

Vijayawada: సింగపూర్ టూర్‌కి టీచర్లు.. 37 మంది టీమ్, మంత్రి నారా లోకేష్ రియాక్షన్

Vijayawada: సింగపూర్ టూర్‌కి టీచర్లు.. 37 మంది టీమ్, మంత్రి నారా లోకేష్ రియాక్షన్
Advertisement

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 37 మంది టీచర్లను ఎంపిక చేసింది. వారికి ప్రత్యేక శిక్షణ కోసం సింగపూర్‌కు పంపింది. ఈ విధంగా ఏపీ నుంచి ఓ టీమ్ సింగపూర్ వెళ్లడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ నుంచి సింగపూర్‌కు టీచర్ల టీమ్..  ఐదు రోజుల పర్యటన

Advertisement

అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల టీ‌మ్‌ను సింగపూర్‌కు పంపించింది. మే నాలుగు నుంచి 9 వరకు ఉపాధ్యాయుల టీమ్ అక్కడ పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా విదేశీ విద్యా విధానాలను అధ్యయనం చేయనుంది.

అంతేకాదు ఉత్తమ బోధనా పద్ధతులను గమనించనుంది. అక్కడి పాఠశాలల్లో అనుసరిస్తున్న వినూత్న బోధన పద్దతులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాంకేతికతను విద్యలో ఏ విధంగా అనుసంధానం చేస్తున్నారో పరిశీలించనుంది. ఈ అధ్యయనం తర్వాత ఏపీ విద్యా రంగంలో మరిన్ని సానుకూల మార్పులు తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం.

Advertisement

విదేశీ విద్యా విధానాలపై అధ్యయనం..  ఉత్తమ బోధనా పద్ధతులపై ఫోకస్

దీనిపై మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఈ టూర్‌లో భాగంగా ఉపాధ్యాయులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్‌లో ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రపంచ స్థాయి ఉత్తమ విద్యా విధానాలను నేర్చుకుని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశమని వివరించారు మంత్రి లోకేష్.

అంతర్జాతీయ శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల నైపుణ్యాలు మెరుగుపడి, విద్యా వ్యవస్థ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో మరొక విషయం వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ పలుమార్లు ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల టీమ్‌ను ప్రపంచ స్థాయి విద్యా విధానాలపై అధ్యయనం కోసం త్వరలో  అక్కడకు పంపవచ్చని వార్తలు లేకపోలేదు.

ALSO READ: హైదరాబాద్ నివాసంలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×