E-Paper
Advertisement

Mission Vatsalya Scheme: చిన్నారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ప్రతీ నెలా రూ. 4 వేలు, ఇంకెందుకు ఆలస్యం

Mission Vatsalya Scheme: చిన్నారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ప్రతీ నెలా రూ. 4 వేలు, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Mission Vatsalya Scheme: చిన్నారులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. వారి కోసం మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాదండోయ్ నెలకు రూ.4 వేల చొప్పున ఇవ్వనుంది. అర్హులైనవారు వీటికి సంబంధించి దరఖాస్తు చేస్తే చాలని అంటున్నారు. లబ్దిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ పని మొదలుపెట్టండి. ఇంతకీ ఈ స్కీమ్ ఏయే చిన్నారులకు వర్తిస్తుంది? కండీషన్స్‌పై ఓ లుక్కేద్దాం.

చిన్నారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Advertisement

కేంద్రం సహకారంతో ఎన్నో పథకాలను అమలు చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. తల్లిదండ్రులు లేని పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు కొత్తగా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. అదే మిషన్ వాత్సల్య స్కీమ్. ఆయా పిల్లల చదువు, పోషణకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకాన్ని అమలు చేయడంపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. లక్షలాది మంది పిల్లలు ఈ పథకం ద్వారా ప్రతీ ఏటా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం గురించి తెలుసుకుని అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు అధికారులు. అర్హులైన చిన్నారులు వెంటనే మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచన చేస్తున్నారు.

మిషన్‌ వాత్సల్య పథకం కింద అర్హులైనవారిని గుర్తించి 18 ఏళ్లు వరకు డబ్బులు ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రతీ నెలకు రూ.4 వేలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. తల్లిదండ్రులు లేని అనాథ చిన్నారులను ఎంపిక చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేనివారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే తల్లిదండ్రుల పిల్లలు ఈ పథకం వర్తించనుంది. అంతేకాదు యాసిడ్ బాధితులు, విడాకులు తీసుకున్న వారి పిల్లలు, ప్రకృతి వైపరీత్యాలలో తల్లిదండ్రులను కోల్పోయివారికి దీనికి పథకానికి అర్హులు. ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు అధికారులు. అప్లికేషన్ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.

Advertisement

ప్రతీ నెలా రూ. 4 వేలు, ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి

ఇక మిషన్ వాత్సల్య కింద ఎంపికైన చిన్నారులకు ప్రతి నెలా రూ.4 వేలు చొప్పున ఆరు నెలలకు వారి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమచేయనుంది ప్రభుత్వం. ఏడాదికి రూ.48 వేలు చొప్పున ఇవ్వనుంది. అర్హులైన వారు ఐసీడీఎస్‌ కార్యాలయం, అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకురాలు, సీడీపీవోను సంప్రదిస్తే పూర్తి వివరాలు చెబుతారు. దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు వారు సమర్పించాల్సివుంటుంది. పిల్లల జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌ బుక్ వంటి పత్రాలు అందజేయాలి. మిషన్ వాత్సల్య స్కీమ్‌కి అర్హుల ఎంపికలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదివే పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి చిన్నారుల వయస్సు 18 ఏళ్ల లోపు ఉండాలి. సంరక్షకుల కుటుంబ వార్షిక ఆదాయం రూరల్ ప్రాంతాల్లో రూ. 72వేలు, పట్టణాల్లో అయితే రూ. 96 వేలు ఉండాలి. ఈ పథకం కింద అందించే డబ్బుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం కలిసి ఇవ్వనున్నాయి.

ALSO READ: సీఎం విజయ్ కాకినాడ టూర్.. తెర వెనుక వైసీపీ, అసలు కారణం అదేనా? 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×