E-Paper
Advertisement

తల్లీకూతుర్లకు నరకం చూపించే ఘోస్ట్‌ఫేస్ కిల్లర్… ఈ సైకోలు చేసిన పని చూస్తే బుర్రపాడు

తల్లీకూతుర్లకు నరకం చూపించే ఘోస్ట్‌ఫేస్ కిల్లర్… ఈ సైకోలు చేసిన పని చూస్తే బుర్రపాడు
Advertisement

Horror Thriller Movie : నిద్రలోనూ కలవర పెట్టే ఘోస్ట్‌ఫేస్ మళ్లీ తిరిగి వచ్చాడు. ఈసారి మరింత భయంకరంగా… హారర్ ఫ్రాంచైజీల్లో ఎప్పటికీ మరచిపోలేని సిరీస్ లలో ‘స్క్రీమ్’ కూడా ఒకటి. 2026 ఫిబ్రవరి 27న ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ‘స్క్రీమ్ 7’ (Scream 7). థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ట్విస్టులు, భయంకరమైన హంతకుడి ఘోస్ట్‌ఫేస్‌ తో నిండిన ఈ సినిమా హారర్ ఫ్యాన్స్‌ను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇప్పటిదాకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

కథలోకి వెళ్తే…

సిడ్నీ ప్రెస్కాట్ (నెవ్ క్యాంప్‌బెల్) గతంలో ఘోస్ట్‌ఫేస్ హంతకుడి నుంచి ప్రాణాలతో బయటపడి ఉంటుంది. గత ఫ్రాంచైజీలు చూస్తే స్టోరీపై మరింత క్లారిటీ వస్తుంది. ఇక ప్రస్తుతం సిడ్నీ తన పేరును సిడ్నీ ఎవాన్స్‌గా మార్చుకుని భర్త మార్క్, కూతుళ్లతో కలిసి ఒక చిన్న ఊరిలో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమె ఒక కాఫీ షాప్ నడుపుకుంటూ సాధారణ జీవితం గడుపుతుంది. కానీ ఆమె ప్రశాంతత ఎక్కువ కాలం నిలవదు. వుడ్స్‌బోరోలో జరిగిన పాత హత్యల నిందితుడు మళ్లీ తిరిగి వచ్చాడనే వార్తలు వస్తాయి.

Advertisement

ఈసారి ఘోస్ట్‌ఫేస్ కిల్లర్ సిడ్నీ పెద్ద కూతురు టాటమ్ (ఇసాబెల్ మే)ను తన తదుపరి టార్గెట్‌గా ఎంచుకుంటాడు. హంతకులు సిడ్నీని మానసికంగా దెబ్బతీయడానికి పాత జ్ఞాపకాలను ఆయుధంగా వాడుకుంటారు. AI డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి గతంలో చనిపోయిన ఘోస్ట్‌ఫేస్ కిల్లర్ల ముఖాలతో సిడ్నీని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ క్రమంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. దర్యాప్తు సాగుతున్న కొద్దీ హంతకులు ఎవరో బయట పడుతుంది.

ఆసుపత్రి సూపర్‌వైజర్ మార్కో, సిడ్నీ పక్కింటి ఆవిడ జెస్సికా ఈ హత్యల వెనుక ఉన్నారని తేలుతుంది. వారు టాటమ్‌ను ‘సిడ్నీ 2.0’గా మార్చాలని ప్లాన్ వేస్తారు. చివరి దశలో సిడ్నీ తన కూతురిని ఆ సైకో హంతకుల నుంచి ఎలా కాపాడుకుంది ? ఆ ఘోస్ట్‌ఫేస్ రహస్యం ఏమిటి ? అనే అంశాలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఘోస్ట్‌ఫేస్ హంతకుడి భయంకరమైన రీటర్న్, ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీ వంటి ట్రెండింగ్ అంశాలు, కొత్త ట్విస్టులు, సస్పెన్స్, యాక్షన్, నెవ్ క్యాంప్‌బెల్ ఇంటెన్స్ యాక్టింగ్ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. ‘స్క్రీమ్ 7’ ఇప్పుడు Amazon Prime Video, ZEE5లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం అందుబాటులో లేదు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రం ఒరిజినల్ భాష అయిన ఇంగ్లీష్ ఆడియోతో పాటు హిందీ భాషలో మాత్రమే లభ్యమవుతోంది. హారర్ సినిమాలను, ముఖ్యంగా ‘స్కీమ్’ ఫ్రాంచైజీని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని చూడకపోతే ఓ మంచి థ్రిల్లర్ ను మిస్ అయినట్టే.

Advertisement

Read Also : ఇలాంటి యాక్షన్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు.. నెట్‌ఫ్లిక్స్‌ను రూల్ చేస్తోన్న నెంబర్ 1 సిరీస్ ఇదే!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×