E-Paper
Advertisement

Chandrababu : కరకట్ట గెస్ట్‌హౌస్‌ అటాచ్.. బాబుకు జగన్ ప్రభుత్వం షాక్..

Chandrababu : కరకట్ట గెస్ట్‌హౌస్‌ అటాచ్.. బాబుకు జగన్ ప్రభుత్వం షాక్..
Advertisement

Advertisement

Chandrababu : ఏపీ ప్రభుత్వం సంచలన చర్యలు చేపట్టింది. చంద్రబాబుకు భారీ షాక్‌ ఇచ్చింది. కృష్ణానది కరకట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వం అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

అధికారంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ క్విడోప్రోకోకు పాల్పడ్డారని గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది. CRDA మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ పొందారనేది ప్రధాన ఆరోపణ. చట్టాలను, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని అభియోగాలు నమోదు చేసింది.

Advertisement

వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. క్రిమినల్‌ లా అమెండ్ మెంట్‌ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్ హౌస్ ను అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది. ఈ విషయంపై స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చింది.

లింగమనేని రమేష్ కు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని గతంలో వైసీపీ నేతలు ఆరోపించారు. తన ఆస్తలు విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారని విమర్శించారు. లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందని ఆరోపించారు.

రాజధానిలో బినామీల పేరుతో టీడీపీ నేతలు భూమలు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు గతంలో విమర్శించారు. రాజధాని స్టార్టప్ ప్రాంతంలో నారాయణ భూములు కొన్నారని ఆరోపించారు. రూ.3.66 కోట్లతో 2015 జూన్, జులై, ఆగస్టులో ఈ భూములు కొనుగోలు చేశారని సీఐడీ గుర్తించింది. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్ రాపూరు సాంబశివరావు పేరుతో భూములు కొన్నారని నిర్ధారించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×