E-Paper
Advertisement

Mother’s health problems: పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపించే తల్లి ఆరోగ్య సమస్యలు..

Mother’s health problems: పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపించే తల్లి ఆరోగ్య సమస్యలు..
Advertisement

Mother’s health problems: చాలావరకు వ్యాధులు.. జెనటిక్ లోపాల కారణంగా లేదా తల్లిదండ్రులకు ముందుగా ఆ వ్యాధుల హిస్టరీ ఉన్న కారణంగా పిల్లలకు కూడా సోకుతాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో తేలింది. అయినా కూడా ఈ రోజుల్లో తల్లిదండ్రులు.. ముఖ్యంగా గర్భవతులు.. తమ ఆరోగ్య సమస్యలు తమ పిల్లలకు సోకకుండా ఉండేలాగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒబిసిటీ లేదా డయాబెటీస్ ఉన్న మహిళల సంతానంపై వాటి ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Advertisement

ఒబిసిటీ లేదా డయాబెటీస్ ఉన్న మహిళలకు సంతానం కలిగినప్పుడు.. ఆ వ్యాధులు వారి పిల్లలకు కూడా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం చిన్న వయసులో లేదా టీనేజ్‌లో మాత్రమే కాకుండా ఇలా వచ్చే సమస్యలు జీవితాంతం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ప్రెగ్నెన్సీ అనేది పిల్లలు పుట్టకముందే వారికి ఎంతో ముఖ్యంగా ఉండే ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియ సమయంలో తల్లి ఏదైనా ఆరోగ్య సమస్యను ఎదుర్కుంటున్నప్పుడు అది పిల్లలకు కూడా పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు మహిళలు ఎదుర్కునే ఆరోగ్య సమస్యలు పుట్టబోయే బిడ్డ ఎంతకాలం జీవించగలదు అనే విషయాన్ని కూడా డిసైడ్ చేస్తాయని అన్నారు. మామూలుగా కొందరు మహిళలు ముందు నుండే ఒబిసిటీ పేషెంట్లు కాకుండా.. కేవలం ప్రెగ్నెన్సీ సమయంలోనే ఒబిసిటీకి గురయినా కూడా అది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. కేవలం జెనటిక్ సమస్యలే ఇలాంటి వ్యాధులు పిల్లలకు సోకడానికి కారణమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. దానికి సమాధానం ఇంకా తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Advertisement

ముఖ్యంగా జీన్స్ కారణంగానే తల్లి నుండి బిడ్డకు ఒక వ్యాధి అనేది పాస్ అవుతుందని శాస్త్రవేత్తలు ప్రాథమిక పరిశోధనల్లో తేలినా.. దీనికి మరెన్నో కారణాలు ఉంటాయని వారు చెప్తున్నారు. ముందుగా దీనికి కారణాలు కనుక్కోగలిగితే.. తల్లికి ఉండే ఆరోగ్య సమస్యల నుండి పుట్టబోయే బిడ్డలను కాపాడవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో తల్లికి ఉండే సమస్యలు బిడ్డకు రాకుండా ప్రెగ్నెన్సీ సమయంలోనే తల్లులు పలు డ్రగ్స్‌ను ఉపయోగించడంతో పాటు చికిత్సను కూడా తీసుకుంటున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×