E-Paper
Advertisement

AP Flamingo Festival: నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. వ్యూపాయింట్స్, బోటింగ్ ఇక్కడే.. ఉచిత బస్సులు కూడా

AP Flamingo Festival: నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్.. వ్యూపాయింట్స్, బోటింగ్ ఇక్కడే.. ఉచిత బస్సులు కూడా
Advertisement

AP Flamingo Festival: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ కు రెడీ అయింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఫ్లెమింగో ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. నేలపట్టు, అటకానితిప్ప ప్రాంతాల్లో ఫ్లెమింగో వ్యూ పాయింట్లను సందర్శించనున్నారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో నిర్వహించే ఉత్సవంలో సీఎం పాల్గొంటారు.

పులికాట్ తీరంలో

పులికాట్‌ సరస్సు తీరంలో.. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ‘ఫ్లెమింగో ఫెస్టివల్‌’ నిర్వహించనున్నారు.. ఈ ఫెస్టివల్ ను ముందుగా రెండు రోజులే నిర్వహించాలనుకున్నారు. అయితే టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉండడంతో మరో రోజుకు పెంచినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. ఈ ఉత్సవాలు నిర్వహించే జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో ఏర్పాట్లను ఎస్పీ, ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. పులికాట్ సరస్సు చుట్టూ ఉన్న ముఖ్య ప్రదేశాలలో పర్యావరణం, పర్యాటకం, సంస్కృతి, సమాజ భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ ఫ్లెమింగో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఫ్లెమింగో వ్యూ పాయింట్లు:

Advertisement

• నేలపట్టు పక్షుల అభయారణ్యం
• అటకానితిప్ప
• బీవీ పాలెం పాయింట్
• ఉబ్బలమడుగు జలపాతాలు
• ఇరుక్కం ద్వీపం

ముఖ్యాంశాలు

• నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ పాలెం నుంచి ఉచిత బస్సు సదుపాయం
• సూళ్లూరుపేటలో ఫెస్ట్ ప్రధాన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
• శ్రీ సిటీ, శ్రీహరికోట, చేనేత కళాకారులు, ప్రభుత్వ విభాగాల స్టాళ్లు ఏర్పాటు
• బీవీ పాలెంలో బోటింగ్, పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్

ట్రిప్ ధరలు

Advertisement

• 40 నిమిషాల బోటింగ్- రూ.30
• ఇరుక్కం దీవి రౌండ్ ట్రిప్- రూ.100

సెక్యూరిటీ

• ట్రాఫిక్, ప్రజల భద్రత కోసం నిరంతరం సీసీటీవీ, డ్రోన్ నిఘా
• ప్రభుత్వ ఖర్చుతో 6,000 మంది విద్యార్థులు ఫెస్టివల్ ను సందర్శించనున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×