// // AP Cabinet Decisions: రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులు.. ఉద్యోగులకు రెండు డీఏలు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలివే -->
E-Paper
Advertisement

AP Cabinet Decisions: రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులు.. ఉద్యోగులకు రెండు డీఏలు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

AP Cabinet Decisions: రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులు.. ఉద్యోగులకు రెండు డీఏలు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
Advertisement

AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యా రంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో కొత్తగా నిర్మించే లోక్ భవన్‌తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, రెండు గెస్ట్ హౌస్ లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

506 ప్రాజెక్టులకు ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన సమావేశంలో 44 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టుల పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రూ.20 వేల కోట్ల పెట్టుబడులు

Advertisement

అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ.532 కోట్ల మేర టెండర్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్ లో చర్చించారు. ఎస్ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి దాదాపు రూ.20,444 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వీటి ద్వారా 56 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయని మంత్రి పార్థసారథి తెలిపారు.

Also Read: Janasena Suryachandra: పబ్బా? పార్టీ క్లబ్బా? ఆ జనసేన కార్యాలయంలో మందుబాబుల జల్సాలు

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు

Advertisement

ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పిండి. రెండు విడతల DA మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా 3.64 శాతం చొప్పున DA చెల్లించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని 417 పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×