E-Paper
Advertisement

Ind vs SA 2nd T20I: జితేష్ శ‌ర్మ వికెట్ పై వివాదం..తిల‌క్ వ‌ర్మ పోరాటం వృవృథా, రెండో టీ20లో టీమిండియా ఓట‌మి

Ind vs SA 2nd T20I: జితేష్ శ‌ర్మ వికెట్ పై వివాదం..తిల‌క్ వ‌ర్మ పోరాటం వృవృథా, రెండో టీ20లో టీమిండియా ఓట‌మి
Advertisement

Ind vs SA 2nd T20I:  5 టీ20ల‌ సిరీస్ లో టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చింది దక్షిణాఫ్రికా. మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించి గెలిచిన టీమ్ ఇండియాను రెండో టి20 లో మాత్రం ఓడించింది దక్షిణాఫ్రికా. మొదటి మ్యాచ్ లో గెలిచిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగిన టీమిండియా, ఏకంగా 51 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్ లాంటి వాళ్ళు అట్టర్ ఫ్లాప్ కావడంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేశాడు. తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డం, ఆస్కింగ్ గ్రేట్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టీమిండియా ఓడిపోయింది. 214 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 20 ఓవ‌ర్లు ఆడిన టీమిండియా 162 ప‌రుగులు మాత్ర‌మే ఆలౌట్ అయి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించిన స‌ఫారీ జ‌ట్టు, 1-1 తేడాతో సిరీస్ ను ఈక్వెల్ చేసింది. ఇక ద‌క్షిణాఫ్రికా వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య మ‌రో 3 టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. ఇందులో పై చేయి సాధించిన జట్టు, సిరీస్ కైవ‌సం చేసుకోనుంది.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

తిల‌క్ వ‌ర్మ పోరాటం వృధా, రెండో టీ20లో టీమిండియా ఓట‌మి

Advertisement

మొద‌టి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, రెండో టీ20 మ్యాచ్ లో మాత్రం దారుణంగా ఓడిపోయింది. న్యూ చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ( Maharaja Yadavindra Singh International Cricket Stadium, Mullanpur, New Chandigarh) వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా, 20 ఓవ‌ర్లు ఆడి 4 వికెట్లు న‌ష్ట‌పోయి 213 ప‌రుగులు సాధించింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 19.2 ఓవ‌ర్ల‌లో 162 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది టీమిండియా. దీంతో 51 ర‌న్స్ తేడాతో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ 34 బంతుల్లో 62 ప‌రుగులు సాధించాడు. అయినా మిగిలిన ప్లేయ‌ర్లు ఫ్లాఫ్ అయ్యారు. దీంతో టీమిండియా ఓడిపోవాల్సి వ‌చ్చింది.

జితేష్ శ‌ర్మ వికెట్ పై వివాదం

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ జితేష్ శర్మ వికెట్ పై కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన జితేష్ శర్మ, మొదట్లోనే ఔట్ అయ్యేవాడు. కానీ అదృష్టం బాగుండి బయటపడ్డాడు. బార్ట్ మాన్ బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు జితేష్ శర్మ. అయితే ఆ బంతి వికెట్లకు తగిలి వెళ్ళింది కానీ, బెయిల్స్ ను మాత్రం కిందపడేయ‌ లేకపోయింది. బంతి వికెట్లకు తగలగానే లైట్ మాత్రమే వచ్చింది. రూల్స్ ప్రకారం వికెట్లకు బంతి తగిలిన తర్వాత బెయిల్స్‌ కింద పడాలి. అప్పుడే బ్యాట‌ర్ ఔట్. కానీ జితేష్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెయిల్స్ కింద పడలేదు. దీంతో బతికి బయటపడ్డాడు. అనంతరం రెండు సిక్సులు అలాగే రెండు బౌండరీల‌తో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో 27 పరుగులు సాధించాడు. కానీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

Advertisement

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×