E-Paper
Advertisement

Vangalapudi Anitha: నోరు అదుపులో పెట్టుకో.. అంబటి రాంబాబుకు హోం మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

Vangalapudi Anitha: నోరు అదుపులో పెట్టుకో.. అంబటి రాంబాబుకు హోం మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లా వేదికగా హోం మంత్రి వంగలపూడి అనిత వైసిపి నాయకుడు అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని.. ఆయన ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆమె మండిపడ్డారు. గతంలో తాను గౌరవార్థం ‘గారు’ అని సంబోధించేదాన్నని.. కానీ అంబటి రాంబాబు ప్రవర్తన చూస్తుంటే ఆయన ఆ గౌరవానికి ఏమాత్రం అర్హుడు కాదని అనిత స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను హోం మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రబాబు గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు నీ ఇంటికి వెళ్లి నీ భార్యను, కూతురిని అడుగు, వారు చెబుతారు ఆయన విలువ ఏమిటో’అంటూ ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం అత్యంత నీచమైన భాషను వాడుతున్నారని.. ఇది ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

Advertisement

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసిపి నేతలు కుట్రలు చేస్తున్నారని అనిత ఆరోపించారు. విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పట్టాభి ఒక పదం వాడారనే నెపంతో పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని, ఇప్పుడు అంబటి అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారని గుర్తుచేశారు.

చంద్రబాబు నాయుడును అన్యాయంగా జైలుకు పంపినందుకే ప్రజలు వైసిపిని 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని ఆమె విమర్శించారు. పోలీసులపై కూడా అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించే పన్నాగం సాగనివ్వమని అనిత స్పష్టం చేశారు. అంబటి మాట్లాడే భాషను ఆయన కుటుంబ సభ్యులు కూడా సమర్థించరని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె హితవు పలికారు.

Advertisement

Also Read: చెప్పుతో కొడతాం.. నాలుక చీరేస్తాం.. టీడీపీ శ్రేణుల ముట్టడితో గుంటూరులో హైటెన్షన్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×