E-Paper
Advertisement

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా ఇదే.. లక్షల్లో ఓట్ల గల్లంతు, మీ పేరు లేకపోతే?

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా ఇదే.. లక్షల్లో ఓట్ల గల్లంతు, మీ పేరు లేకపోతే?
Advertisement

Draft Voters: ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా, తప్పులను సరిదిద్దే ఉద్దేశంతో ఈ కసరత్తును కొనసాగిస్తున్నారు.

ముసాయిదా జాబితా ముఖ్యాంశాలు

Advertisement

రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లను పరిశీలించగా.. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన 3.71 కోట్ల మందితో తాజా డ్రాఫ్ట్ జాబితాను సిద్ధం చేశారు. ఈ పరిశీలనలో మరణించిన 15.22 లక్షల మందితో పాటు, రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న 7.37 లక్షల మందిని గుర్తించి మొత్తం 44.89 లక్షల పేర్లను తొలగించారు. అయితే, ఎలాంటి నోటీసు లేదా సరైన విచారణ లేకుండా ఏ ఒక్కరి పేరునూ తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలతో భేటీ

Advertisement

ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు వచ్చే నెల 4న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ భేటీలో పార్టీలకు ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను అందజేస్తారు. ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోయినా లేదా ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు ‘ఫామ్-6’ ద్వారా కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలపై విచారణ జరుపుతారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.

Also Read: ‘తుడిచేవాడు కూడా ఓనర్ అయ్యాడు’.. ప్రైవేట్ ట్రావెల్స్‌పై జేసీ హాట్ కామెంట్స్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×