E-Paper
Advertisement

రైళ్లలో భారీ లగేజ్‌లు తీసుకెళ్లేవాళ్లకి షాక్.. కొత్త రూల్స్ ఇవే!

రైళ్లలో భారీ లగేజ్‌లు తీసుకెళ్లేవాళ్లకి షాక్.. కొత్త రూల్స్ ఇవే!
Advertisement

Indian Railways: ప్రయాణికులకు నిత్యం ఏదో వార్త చెబుతూ వుంటుంది ఇండియన్ రైల్వే. అదనపు లగేజీని తీసుకెళ్లే ప్రయాణికులకు కోసం ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే. ఇంతకీ ఏ విధంగా బుక్ చేయాలి? గంట ముందు స్టేషన్‌కు వెళ్లాలని భావిస్తున్నారా? అనే విషయాలను ఓసారి చూద్దాం.

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ప్రయాణికులు తమ అదనపు లగేజీ కోసం ఆన్‌లైన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది రైల్వేశాఖ. కన్ఫర్మ్ టికెట్ ప్రయాణికులు తమ అదనపు లగేజీని ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదీ కూడా టికెట్ బుక్ చేసుకునే సమయంలో. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? దేశవ్యాప్తంగా నేటి నుంచి ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు అనుమతించిన లగేజీ కంటే ఉన్న ఉంటే స్టేషన్‌లోని పార్శిల్ ఆఫీసుకు వెళ్లి బుక్ చేసుకునేవారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

Advertisement

ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు ఉచిత లగేజీ పరిమితికి మించి సామాను వివరాలను పొందుపరచవచ్చు. అప్పుడు దాని ప్రకారం ఉచిత లగేజీ పరిమితి ఎంత? గరిష్ఠంగా ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు? నిషేధిత వస్తువులు విషయం, వర్తించే చార్జీల వంటి పూర్తి సమాచారాన్ని చూపిస్తుంది. ఈ మేరకు ఆ తరహా సిస్టమ్ డెవలప్‌మెంట్‌ను పూర్తి చేసింది సీఆర్ఐఎస్‌.

ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

ప్రయాణికులు రైల్వే పార్శిల్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. బయలుదేరిన స్టేషన్-చేరాల్సిన స్టేషన్ల వివరాలు ఎంచుకోవాలి. తర్వాత ఫార్వార్డింగ్ నోట్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ ఫామ్ సమర్పించాక దాని ప్రింట్‌తోపాటు లగేజీని బయలుదేరిన స్టేషన్‌లోని పార్శిల్ ఆఫీసులో అప్పగించాలి. అక్కడ లగేజీ వెయిట్ చేసిన తర్వాత తుది చార్జీలను లెక్కిస్తారు. చెల్లింపు పూర్తయ్యాక రసీదు ఇస్తారు. ట్రాక్-ట్రేస్ సదుపాయం ద్వారా లగేజీని ట్రాక్ చేయవచ్చు. లగేజీ గమ్యస్థానానికి చేరినప్పుడు ఎస్ఎంఎస్‌ ద్వారా సమాచారం ట్రావెలర్‌కు అందుతుంది. రసీదును చూపించి లగేజీని తీసుకోవచ్చు. ఈ మార్పుతో బుకింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారుల అంచనా.

అన్నట్లు లగేజీ ఎంత తీసుకెళ్లవచ్చు

Advertisement

ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోల వరకు ఉచితం ఉంటుంది. అదనపు చార్జీలు చెల్లించి గరిష్ఠంగా 150 కిలోల వరకు తీసుకెళ్లే సదుపాయం ఉంది. ఏసీ 2-టైర్‌లో 50 కిలోల వరకు ఉచితం తీసుకెళ్లవచ్చు. గరిష్ఠంగా అంటే 100 కిలోల వరకు అనుమతి ఉంటుంది. 3 టైర్ ఏసీ‌లో ఉచిత-గరిష్ఠ పరిమితి రెండూ 40 కిలోలు. ఈ క్లాస్‌లో ట్రావెల్ చేసేవారు అదనపు లగేజీని బుక్ చేసుకునే అవకాశం ఉండచ్చు లేకుంటే లేకపోవచ్చు. స్లీపర్ క్లాస్ లో అయితే 40 కిలోల వరకు ఉచితం ఉంటుంది. గరిష్ఠంగా 80 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

ALSO READ: మనిషి కంటే ఎత్తు.. 15 ఏళ్లకు ఒక్కసారే పూచే ‘హిమాలయన్ డైమండ్’ విశేషాలివే!

లగేజీ బ్యాగుల పరిమాణం

రైల్వే కోచ్‌లలోకి తీసుకెళ్లే లగేజీ బ్యాగుల పరిమాణాలను నిర్దేశించింది. ఫస్ట్ క్లాస్‌ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాసుల్లో 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ వరకు అనుమతి ఉంటుంది. అదనపు లగేజీకి సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ చార్జ్ వసూలు చేయనుంది. కనీస చార్జీ రూ. 30 ఉంటుంది. 3 టైర్ ఏసీలో ఏసీ చైర్ కార్‌‌ల్లో 55 సెం.మీ x 45 సెం.మీ x 22.5 సెం.మీ ఉండాలి. మొత్తానికి భారీ లగేజీలు తీసుకెళ్లేవారికి భారీ షాక్ తప్పదు.

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×