E-Paper
Advertisement

RTC Bus Theft: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. కనురెప్ప పాటులో 15 తులాల బంగారం మాయం

RTC Bus Theft: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. కనురెప్ప పాటులో 15 తులాల బంగారం మాయం
Advertisement

RTC Bus Theft: జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్ప పాటులో ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం గ్రామానికి చెందిన శబనా అనే మహిళ తన పని నిమిత్తం అనంతపురం వచ్చారు. పని ముగించుకుని తిరిగి కదిరికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆమె తన వెంట దాదాపు 15 తులాల విలువైన బంగారు ఆభరణాలను బ్యాగులో భద్రపరుచుకున్నారు. బస్సు ప్రయాణంలో ఉండగా కండక్టర్ టికెట్ అడిగారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో, ఆధార్ కార్డు చూపించేందుకు శబనా తన బ్యాగును తెరిచారు.

Advertisement

బ్యాగ్ తెరిచి చూడగా లోపల ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆందోళనతో వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు అనంతపురం కలెక్టరేట్ సమీపంలో బస్సును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులందరి బ్యాగులను, లగేజీని జల్లెడ పట్టారు. ఎంత వెతికినా బంగారు ఆభరణాలు మాత్రం దొరకలేదు.

బస్సు ఎక్కే సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో నగలు లభ్యం కాకపోవడంతో వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు బస్సును కదిరికి పంపించేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Read Also: Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌ చాలా సేఫ్, ఎవరూ కనిపెట్టలేరని అనుకుంటున్నారా? వాస్తవం ఇదీ!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×