E-Paper
Advertisement

OnePlus Turbo: గేమింగ్ ఫోన్లలో నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్.. 16GB RAM, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్తఫోన్!

OnePlus Turbo: గేమింగ్ ఫోన్లలో నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్.. 16GB RAM, 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్తఫోన్!
Advertisement

OnePlus Turbo: త్వరలో చైనాలో సరికొత్త ‘OnePlus Turbo’ సిరీస్‌ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రధానంగా గేమింగ్ లవర్స్ కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, లాంచ్ తేదీలను ఎక్కడా అధికారికంగా తెలియజేయలేదు. అయితే ఈ ఫోన్ గురించి తాజాగా కొన్ని లీక్స్ వెలువడ్డాయి. వాటి ద్వారా త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న Turbo సిరీస్ గురించి కొన్ని కీలక వివరాలు తెలుసుకుందాం.

బెంచ్‌మార్క్ లీక్‌ల ప్రకారం.. OnePlus Turbo ఆక్టా-కోర్ ARMv8 చిప్‌సెట్‌తో వస్తుంది. అలాగే టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ కావచ్చు. ఈ ప్రాసెసర్‌లో 3.21GHz ప్రైమ్ కోర్, మూడు పెర్ఫార్మెన్స్ కోర్లు, నాలుగు ఎఫిషియెన్సీ కోర్లు ఉంటాయి. గ్రాఫిక్స్ కోసం Adreno 825 GPU మద్దతు అందిస్తుంది.

Advertisement

Also Read: రూ.11,999కే వివో T4 Lite 5G స్మార్ట్‌ఫోన్.. సేల్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది బాసూ!

16GB ర్యామ్:

లీక్ లిస్టింగ్‌లో ఈ ఫోన్ 14.81GB RAMను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే బిజినెస్ వర్షన్ 16GB RAMతో రానుందని ఊహాగానాలు ఉన్నాయి. అలాగే ఈ వన్‌ప్లస్ టర్బో Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ అనుభవం సులభతరం అవుతుంది.

లాంచింగ్ అప్పుడే:

Advertisement

టెక్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ ఫోన్ వచ్చే ఏడాది జనవరిలో చైనా మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లి జీ లూయిస్ వీబో ద్వారా ఈ సిరీస్ అభివృద్ధి దశలో ఉందని ధృవీకరించారు. ఈ కొత్త సిరీస్ వన్‌ప్లస్ గురించి కంపెనీ 12వ వార్షికోత్సవ వేడుకల్లో కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే.

OnePlus Turbo స్పెసిఫికేషన్స్:

ప్రస్తుతం లీక్ అయిన సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ టర్బో సిరీస్‌లోని ఒక మోడల్ OnePlus Ace 6 Turbo పేరుతో రాబోతోంది. ఇందులో 9,000mAh బారీ బ్యాటరీ, 6.78 అంగుళాల LTPS OLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 144Hz లేదా 165Hz రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఫీచర్లు  గేమింగ్ లవర్స్‌ను ప్రత్యేకంగా ఆరర్షించే అవకాశం ఉంది.

భారీ అంచనాలు:

ఇకపోతే వన్‌ప్లస్ టర్బో సిరీస్ ఫోన్లలోని భారీ బ్యాటరీ.. హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ చిప్‌సెట్ గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ఈ ఫోన్ కోసం వన్‌ప్లిస్ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: అమెజాన్‌ డీల్ అదిరింది.. రియల్‌మీ 14X 5G ఫోన్ ఇప్పుడు బడ్జెట్‌లో 50MP కెమెరాతో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×