E-Paper
Advertisement

Ambati Rambabu: అంబటి బండ బూతులు.. ఏకంగా చంద్రబాబునే, ఫైర్ అవుతోన్న తమ్ముళ్లు

Ambati Rambabu: అంబటి బండ బూతులు.. ఏకంగా చంద్రబాబునే, ఫైర్ అవుతోన్న తమ్ముళ్లు
Advertisement

Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బయటకు ప్రస్తావించలేని పదాలను ఉపయోగించి.. దూషించారు. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గుంటూరులో అంబటి పర్యటనను తెలుగు దేశం శ్రేణులు అడ్డుకోవడంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. వైసీపీ తలపెట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనేందుకు గోరంట్లకు వెళ్తున్న తన వాహనాన్ని అడ్డగించడంతో బూతుల పురాణాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అంబటి వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపడంతో.. టీడీపీ శ్రేణులు ఆయనపై విరుచుకుపడుతున్నారు.

కర్రలు, రాడ్లతో దాడికి యత్నం!

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి గుంటూరులోని చిల్లీస్ సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్లెక్సీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని.. దానిని వెంటనే తొలగించాలని శుక్రవారం అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. లేదంటే తానే స్వయంగా వచ్చి తొలగిస్తానని సవాలు విసిరారు. ఈ క్రమంలోనే శనివారం కారులో గోరంట్లకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి ఫ్లెక్సీ వద్దకు రావాలని అంబటి భావించారు. ఈ క్రమంలో గోరంట్లకు బయలుదేరిన అంబటి కారును పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కర్రలు, రాడ్లతో ఆయనపై దాడికి యత్నించారన్న ఆరోపణలను వైసీపీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన అంబటి.. చంద్రబాబును ఘాటు పదజాలంతో దూషించారు.

Advertisement

ప్లాన్ ప్రకారమే దాడికి యత్నం: అంబటి

ఘటనపై అంబటి రాంబాబు స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారన్న అంబటి.. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారని ఆక్షేపించారు. టీడీపీ కార్యకర్తలు.. కర్రలు, రాడ్లను పట్టుకొని నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉండిపోయారని అంబటి ఆరోపించారు. కాగా ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోనూ ఓ గుడిలో రజినీ పూజలు చేస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం తీవ్ర గందరగోళానికి కారణమైంది.

Also Read: Samsung Galaxy S26 Ultra: శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫీచర్లు లీక్.. కెమెరా, బ్యాటరీ, కీలక వివరాలు మీ కోసం!

టీడీపీ శ్రేణులు ఫైర్..

Advertisement

సీఎం చంద్రబాబును అనరాని మాటలు అన్న అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంను దూషించిన అంబటిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాహసం మరే వైసీపీ నేత చేయకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తెలుగు దేశం కార్యకర్తలు కోరుతున్నారు.

Also Read: Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×