E-Paper
Advertisement

Anil Ravipudi: వెంకీకి జోడిగా డిజాస్టర్ బ్యూటీ… సాహసం చేస్తున్న అనిల్ రావిపూడి!

Anil Ravipudi: వెంకీకి జోడిగా డిజాస్టర్ బ్యూటీ… సాహసం చేస్తున్న అనిల్ రావిపూడి!
Advertisement

Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ రావిపూడి పటాస్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క సినిమా సూపర్ సక్సెస్ కావడంతో అనిల్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఇక ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనిల్ కెరీయర్ లో తొమ్మిదవ సినిమా కావటం విశేషం. ఇక అనిల్ రావిపూడి పదవ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్..

అనిల్ రావిపూడి పదవ సినిమాని ఏ హీరోతో చేయబోతున్నారనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఈయన తదుపరి సినిమాని విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నారని స్పష్టం అవుతుంది. ఇప్పటికే సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యామని, చాలా క్రేజీగా ఉండబోతుందని అనిల్ రావిపూడి స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో ఉందని మరొక 15 రోజులలో ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

వెంకటేష్ కు జోడిగా పూజ హెగ్డే..

Advertisement

వెంకటేష్ తో అనిల్ రావిపూడి చేయబోయే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనిల్ రావిపూడి పూజ హెగ్డేను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది కాస్త సంచలనగా మారింది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు అనిల్ రావిపూడి డిజాస్టర్ హీరోయిన్ ను ఎంపిక చేసి సాహసం చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

క్యామియో పాత్రలో స్టార్ హీరో..

Advertisement

పూజా హెగ్డే సినీ కెరియర్లో హిట్ సినిమాల కంటే కూడా ఫ్లాప్ సినిమాల జాబితా ఎక్కువగా ఉంది ఇటీవల ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లు అవుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈమెకు అవకాశం ఇవ్వటం సరైన నిర్ణయమేనా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి పూజా హెగ్డేకు అవకాశం ఇచ్చి ప్లాప్ నుంచి తనని బయటపడేస్తారా లేదంటే తన సినిమాని రిస్క్ లో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. వెంకటేష్ పూజ హెగ్డే జంటగా నటించబోతున్నారు అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అనిల్ రావిపూడి నుంచి ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో క్యామియో కూడా ఉండబోతుందని ఆ పాత్రలో రానా లేదా ఫహద్ ఫాజిల్ నటించబోతున్నారంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: Ramcharan: రామ్ చరణ్ మంచి మనసు…500 మంది డ్యాన్సర్లకు అండగా మెగా హీరో!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×