E-Paper
Advertisement

బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్!

బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్!
Advertisement

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నేతల ఐక్యత, వారి భేటీలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సంతాప సభ ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రాజకీయ మంటలు రాజేసింది. ముద్రగడ కుటుంబంలో జరిగిన సంతాప సభకు హాజరై తన పక్కన కూర్చున్నారనే కారణంతో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు.

కాపులు ఒకటైతే చంద్రబాబుకు భయం..

Advertisement

కాపులందరూ ఒకే వేదికపైకి వచ్చి కలిసికట్టుగా నిలబడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎక్కడ లేని కడుపుమంట వస్తోందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా, కేవలం కాపు నేతలతో కలిసి కూర్చున్నందుకే బొండా ఉమకు షోకాజ్ నోటీసు జారీ చేయడం ఆయన వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

సంతాప సభల్లోనూ రాజకీయాలా?

Advertisement

‘కాపుల్లో అలజడి మొదలైంది’ అని బొండా ఉమ అన్న మాటలపై టిడిపికి ఏవైనా అభ్యంతరాలు లేదా ఆక్షేపణలు ఉంటే ఉండవచ్చని, కానీ అసలు సంతాప సభకే వెళ్ల వద్దనడం ఎంతవరకు న్యాయమని అంబటి నిలదీశారు. కాపుల పక్కన కూర్చోవద్దని ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బాధలో ఉన్న వారిని పరామర్శించేందుకు నిర్వహించిన సభకు అన్ని పార్టీల నాయకులు వస్తారని, అక్కడ పాల్గొంటే వచ్చిన తప్పేమిటని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఉండే ఇలాంటి కార్యక్రమాలను కూడా వివాదాస్పదం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

Also Read: డీఎస్సీపై అసత్యాలు చెప్తే ఊరుకోం.. బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండపల్లి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×