E-Paper
Advertisement

రామ్ చరణ్‌కి సర్జరీ సక్సెస్.. కోయంబత్తూర్ హాస్పిటల్‌లో రిస్కీ ఆపరేషన్!

రామ్ చరణ్‌కి సర్జరీ సక్సెస్.. కోయంబత్తూర్ హాస్పిటల్‌లో రిస్కీ ఆపరేషన్!
Advertisement

Ram Charan Wrist Surgery: ఎంతటి స్టార్ కిడ్స్ అయినా నమ్మిన సినిమా కోసం ఎంతదాకా అయినా వెళ్తారు.కొన్ని కొన్ని సార్లు ప్రాణాలని రిస్క్ లో పెడతారు కూడా.ఇక అలాగే రామ్ చరణ్ కూడా తను నమ్మిన పెద్ది సినిమా కోసం కష్టపడుతూ షూటింగ్ లో  మణికట్టుకు గట్టి దెబ్బ తగిలించుకున్న సంగతి తెల్సిందే,ఇక గాయంతోనే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసిన చరణ్ అది రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో తమిళనాడులోని కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌లో చేరిన సంగతి తెల్సిందే.

మియామి నుంచి ప్రత్యేకంగా వచ్చిన హ్యాండ్ సర్జన్

Advertisement

ఇక తాజాగా ఈ సర్జరీ పూర్తి అయిందని, కోయంబత్తూర్‌కు చెందిన సీనియర్ ఆర్తోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ టీమ్‌తో పాటు, అమెరికాలోని మియామి నుంచి ప్రత్యేకంగా వచ్చిన హ్యాండ్ సర్జన్ డాక్టర్ అలేజాండ్రో బడియా దగ్గరుండి ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ సర్జరీ సమయంలో సురేఖ, చిరు, ఉపాసన కూడా పక్కనే ఉన్నారని సమాచారం.ఇక  ఈ సర్జరీ సక్సెస్ అవడంతో  మా హీరో మళ్ళీ సినిమాల్లోకి దూకేస్తాడోచ్ అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.ఇక సర్జరీ సక్సెస్ కావడంతో వినాయకుడు, హనుమంతుడి గుడిలో ఉపాసన ప్రత్యేక  పూజలు కూడా చేసిందట కూడా.ఇక మెగా ఫ్యామిలీలో మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో భుజం గాయానికి (రోటేటర్ కఫ్) సర్జరీ చేయించుకున్న సంగతి తెల్సిందే.

also read :ఆగస్టు 9న ‘దూకుడు’ రీ-రిలీజ్.. మళ్లీ బాక్సాఫీస్ షేక్ అవుతుందా?

Advertisement

షూటింగ్  సమయంలోనే రెండు సార్లు

పెద్ది సినిమా కోసం నిజమైన పహిల్వాన్లతో కుస్తీ పోటీలు షూట్ చేస్తున్నప్పుడు చరణ్ మణికట్టులోని కార్టిలేజ్ (మృదులాస్థి) దెబ్బతినడంతో సర్జరీ చేయించుకున్నాడు చరణ్.అయితే ఇదే షూటింగ్  సమయంలోనే రెండు సార్లు గాయపడటం గమనార్హం గతేడాది మార్చిలో ముఖానికి దెబ్బతగిలి చిన్న ప్రొసీజర్ జరగగా,క్లైమాక్స్ తీస్తునప్పుడు ఇలా కార్టిలేజ్ ఇంజ్యూర్ అయింది. మొత్తానికి విజయవంతంగా సినిమాని పూర్తి చేసి, సినిమా సక్సెస్ అయిన తర్వాతనే చేతికి సర్జరీ చేయించుకున్న చరణ్ ని అభినందించాల్సిందే.

లెక్కల మాష్టారి లెక్కలు ఎలా ఉన్నాయో !

ఇక సినిమా విషయానికి వస్తే ఈ జూన్ 4న రిలీజైన ‘పెద్ది’మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రూ. 400 కోట్లు కొల్లగొట్టడం విశేషం.ఈ సినిమాలో చరణ్ సరసన   జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించగా శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రల్లో మెప్పించిన సంగతి తెల్సిందే.ఇక వాలకం చూస్తుంటే సర్జరీ తర్వాత దాదాపు కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ కే పరిమితం కానున్న చరణ్ సుక్కు దర్శకత్వంలో రానున్న RC 17 కి డేట్స్ ఇచ్చేందుకు చాలా సమయమే తీసుకునేట్టు కనిపిస్తుంది.ఇక వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో కియారా లేదా రష్మిక కీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉండగా  చేస్తుండగా,నయనతార కీ రోల్ చేయనుందని సమాచారం.చూడాలి లెక్కల మాష్టారి లెక్కలు ఎలా ఉన్నాయో !

also read :ఒడిశా అమ్మాయి సంచలనం.. ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌గా జ్యోతిర్మయి నాయక్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×