E-Paper
Advertisement

Ambati Rambabu: దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం.. వెంకన్న కోపాగ్నికి చంద్రబాబు బలికాక తప్పదు!

Ambati Rambabu: దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం.. వెంకన్న కోపాగ్నికి చంద్రబాబు బలికాక తప్పదు!
Advertisement

Ambati Rambabu: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన ఇల్లు.. ఆఫీసుపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. సుమారు ఏడు గంటల పాటు దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా ఎస్పీకి సమాచారం అందించినా కనీసం పట్టించుకోలేదని అంబటి విమర్శించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని.. కానీ పోలీసులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు పోలీసులను ఏవిధంగా వినియోగిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని.. పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ పరిస్థితులపై ఆలోచించాలని కోరారు. తన అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ.. సీపీఐ.. జనసేన నాయకులు స్పందించి ఖండించినప్పటికీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని అంబటి తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైన తర్వాత కూడా ఇంకా దుష్ప్రచారం చేయడం దేనికని ప్రశ్నించారు. వాస్తవాలను దాచిపెట్టి భగవంతుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం వల్ల చంద్రబాబు నాయుడు స్వామివారి కోపాగ్నికి బలికాక తప్పదని హెచ్చరించారు. దైవ కార్యాల్లో రాజకీయ జోక్యం సరికాదని హితవు పలికారు.

రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైందని.. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసు అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించకుండా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలందరూ ఏకమై ఇలాంటి అరాచక పాలనను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Read Also: Boggula Srinivas Murder: పవన్ కళ్యాణ్ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి.. మిస్ట‌రీ వీడింది!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×