E-Paper
Advertisement

Kiran Kumar Reddy: కమీషన్లకు కక్కుర్తి పడింది మీరు.. బురదజల్లుతోంది మాపై? హరీష్‌పై చామల కిరణ్ ఫైర్!

Kiran Kumar Reddy: కమీషన్లకు కక్కుర్తి పడింది మీరు.. బురదజల్లుతోంది మాపై? హరీష్‌పై చామల కిరణ్ ఫైర్!
Advertisement

Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసుల అంశంలో హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గాంధీ సరోవర్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తూనే.. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

2012 జీఓ ప్రకారం జలాశయాలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని.. కానీ మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు కేవలం 9 మీటర్ల బఫర్ చూపించి నాళాపై అక్రమంగా అనుమతులు పొందారని ఎంపీ వెల్లడించారు. గత ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడం వల్లే నేడు సామాన్య కొనుగోలుదారులు ఇబ్బందుల పాలవుతున్నారని విమర్శించారు. ఇందులో ప్రజల తప్పేమీ లేదని.. బిల్డర్లు , అక్రమాలకు సహకరించిన అధికారులపై కచ్చితంగా కేసులు పెడతామని.. బాధితులకు బిల్డర్ల ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ ప్రతి పనికి అడ్డుపడుతోందని కిరణ్ రెడ్డి మండిపడ్డారు. సబర్మతి, గంగా నదుల ప్రక్షాళన సమయంలోనూ ఆక్రమణలు తొలగించారని.. ఆ విషయం హరీష్ రావుకు తెలియదా అని ప్రశ్నించారు.

ఇటీవలి ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆదరణ చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని.. అందుకే హరీష్ రావు ‘చిల్లర రాజకీయాలు’ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2012 కంటే ముందున్న రికార్డులు కావాలంటే ఇస్తానని.. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం బాధితుల పక్షాన ఉంటుందని.. అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×