E-Paper
Advertisement

Viral Video: రైలు మీద యువకుడి డేంజరస్ స్టంట్స్.. చివరికి ఏమైందంటే?

Viral Video: రైలు మీద యువకుడి డేంజరస్ స్టంట్స్.. చివరికి ఏమైందంటే?
Advertisement

Viral Video: కళ్ల ముందే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. రోడ్డు ప్రమాదాల రక్తం ఇంకా ఆరకముందే మరికొన్ని ప్రాణాలు బలి అవుతున్నా.. నేటి సమాజంలో కొంతమంది తీరు అస్సలు మారడం లేదు. తాజాగా ఓ యువకుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలు మీదకు ఎక్కి, వేగంగా పరిగెడుతూ అక్కడ ఉన్న ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఇప్పుడా కుర్రాడు చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భువనేశ్వర్‌ నుంచి తిరుపతి వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పైకెక్కి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు వీరంగం వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకొంది. ఆదివారం మధ్యాహ్నం సుమారు 3.25 గంటల సమయంలో ప్రయాణికులతో నిండిన రైలు సోంపేట స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే ఫ్లాట్‌ఫారంపై సాధారణ రద్దీ ఉండగా.. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిజయ్ సర్కార్ అనే యువకుడు ఆకస్మాత్తుగా రైలు పై భాగానికి ఎక్కాడు. అతను రైలు బోగీల పై భాగంలో అటూ ఇటూ పరుగులు తీయడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్ధం కాక కొందరు ప్రయాణికులు కిటికిల్లో నుంచి బయటకు చూస్తూ ఆందోలన వ్యక్తం చేశారు.

Advertisement

యువకుడు సమారు 20 నిమిషాల పాటు రైలు పై భాగంలోనే తిరుగుతూ వీరంగం సృష్టించాడు. ఈ పరిణామంతో రైలును అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో రైలు అరగంట పాటు కదలకుండా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ..ఎలాంటి ప్రమాదం జరగకుండా యువకుడిని కిందికి దించి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో బిజయ్ సర్కార్ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగి పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని విచారణ నిమిత్తం చికిత్స కోసం పంపిచారు. ఈ ఘటనతో ఆలస్యం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాకుడా.. దీంతో స్టేషన్‌లో ఉన్న ఇతర రైళ్ల కదలికలపై కూడా ప్రభావం పడింది.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×