E-Paper
Advertisement

EPFO Pension Hike: ప్రైవేట్ ఉద్యోగులకు రూ.5,000 పెన్షన్.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

EPFO Pension Hike: ప్రైవేట్ ఉద్యోగులకు రూ.5,000 పెన్షన్.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం
Advertisement

EPFO Pension Hike: ఈపీఎఫ్ఓ ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ ను రూ.5000 పెంచేందుకు ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతోంది. EPFO ​​పెన్షన్ పథకం కింద ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగులకు కనీస పెన్షన్ నెలకు రూ. 1,000గా ఉంది. చాలా ఏళ్లుగా కనీస పెన్షన్ లో మార్పులు చేయలేదు. ప్రైవేట్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు పెన్షన్ పెంపుపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

రూ.1000 నుంచి రూ.5000 పెంపు

ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద పింఛన్లు అందజేస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీసుల కలిగి ఈపీఎఫ్ చెల్లించిన వారు ఈ పెన్షన్ కు అర్హులు. 58 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఈపీఎస్ పెన్షన్‌ను నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000కు పెంచేందుకు ఈపీఎఫ్ఓ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రస్తుత పెన్షన్ ఇంటి ఖర్చులకు సరిపోదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ప్రైవేట్ ఉద్యోగులకు ఉపసమనం లభించనుంది.

Advertisement

ఈ ప్రతిపాదనతో లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర ఆదాయ వనరులు లేని వారు ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. తదుపరి విధాన చర్చల్లో లేదా కేంద్ర బడ్జెట్ సమయంలో ఈ ప్రతిపాదనపై సమీక్షించవచ్చని సమాచారం.

Also Read:  పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×