// // Shocking Video | కొండ చిలువను మెడలో వేసుకున్న తాగుబోతు.. చివరకు బిగ్ ట్విస్ట్..! -->
E-Paper
Advertisement

Shocking Video : కొండచిలువ మెడలో వేసుకున్న తాగుబోతు.. చివరకు బిగ్ ట్విస్ట్..!

Shocking Video : కొండచిలువ మెడలో వేసుకున్న తాగుబోతు.. చివరకు బిగ్ ట్విస్ట్..!
Advertisement

Shocking Viral Video

Shocking Viral Video : మద్యం తాగిన తర్వాత తాగుబోతుల ఆలోచనా శక్తి, అర్థం చేసుకునే శక్తిని పూర్తిగా కోల్పోతారు. ఏం చేస్తున్నారో కూడా అసలు అర్ధం కాదు. నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. సోయ లేకుండా పడిపోతుంటారు. మద్యం మత్తు మనిషిని ఏ స్టేజ్‌కు అయినా తీసుకెళ్తుంది. మత్తులో చేసేది తప్పా.. ఒప్పా అనే విషయం కూడా మత్తులో ఉన్నవారికి తెలియదు.

Advertisement

అయితే కొందరు తాగుబోతులు చేసే పనులు చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. వారి చేసే పనులు చూస్తే పగలపడి నవ్వకుండా ఉండలేము. మరికొందరైతే మద్యం మత్తులో ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుందో
కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.

Read More : ఛీ వీడు మనిషేనా.. పానీపూరిలో మూత్రం కలిపాడు!

Advertisement

కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఘటనలే తాగుబోతుల ప్రాణాల మీదకి కూడా వచ్చాయి. తాజాగా ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ భారీ కొండచిలువతో ఆ తాగుబోతు చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెడలో కొండ చిలువను వేసుకుని తాగి ఊగుతూ రోడ్డుపై హల్‌చల్ చేశాడు.

కొండచిలువను తీసుకుని డైరెక్ట్‌గా పెట్రోల్ బంక్‌లోకి దూరాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా
షాక్ అయ్యారు. ఈ సంఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది. చంద్రన్ అనే వ్యక్తి రాత్రి ఫుల్‌గా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు.

ఎక్కడి నుంచో వచ్చిన ఓ కొండ చిలువను తీసుకుని తన మెడలో వేసుకున్నాడు. అనంతరం అక్కడే ఉన్న ఓ పెట్రోల్‌ బంకులోకి వెళ్లాడు. తాను మెడలో కొండచిలువను వేసుకుంటానని.. దాన్ని ఫోటో తీయాలని పెట్రోల్ బంకు సిబ్బంది అభిషేక్‌కు తెలిపాడు. అది విన్న స్థానికులు అవాక్కయారు.

మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో అర్థం కావాడంలేదు. అలా మాట్లాడుతూ ఉండగానే.. ఆ కొండచిలువ కూడా భయపడిపోయింది. అంతలోనే అతడి మెట చుట్టడం ప్రారంభించింది. గొంతును గట్టిగా నొక్కి ఉంచడంతో చంద్రన్ కింద పడిపోయాడు. వెంటనే పెట్రోల్‌ బంక్ సిబ్బంది చంద్రన్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు.

Read More : అంబానీ దంపతుల డ్యాన్స్ అదుర్స్‌, వైరల్ అవుతున్న వీడియో

తాగుబోతు మెడకు కొండచిలువ గట్టిగా చుట్టడంతో ఊపిరి అందక కిందపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కొండ చిలువ నుంచి అతడిని తప్పించారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియో తీశారు.

వీడియోను సోషల్ మీడియాలో రమిత్ మై ఇండియా అనే అకౌంట్ నుంచి ఎక్స్‌లో అప్లోడ్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి జంతువులతో పరాచకాలు ఏంటని మండిపడుతున్నారు.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×