E-Paper
Advertisement

Starbucks Job: స్టార్‌బక్స్‌లో ఉద్యోగం.. రూ.3 కోట్లు జీతం.. ఆకాశంలో 35,000 అడుగుల ఎత్తులో ఆఫీసు

Starbucks Job: స్టార్‌బక్స్‌లో ఉద్యోగం.. రూ.3 కోట్లు జీతం.. ఆకాశంలో 35,000 అడుగుల ఎత్తులో ఆఫీసు
Advertisement

Starbucks Job| ప్రముఖ కాఫీ కంపెనీ స్టార్‌బక్స్.. కాఫీలు, లాటెలకు దూరంగా ఒక కొత్త ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ ఉద్యోగం పొందేవారికి ఏడాదికి రూ.3.08 కోట్ల (360,000 డాలర్లు) వేతనం. అయితే ఈ ఉద్యోగం చేసేవారికి విమానం నడపడంలో విస్తృత అనుభవం అవసరం. స్టార్‌బక్స్ తమ కంపెనీ విమానాన్ని నడిపేందుకు ఒక పైలట్‌ను నియమించుకోనుంది. ఈ పైలట్ దేశంలోనూ, విదేశాల్లోనూ స్టార్‌బక్స్ ప్రతినిధిగా వ్యవహరిస్తారు.

స్టార్‌బక్స్ తమ వెబ్‌సైట్‌లో ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలను పేర్కొంది. ఈ ఉద్యోగం కోసం ఎంపికైన వ్యక్తి, కంపెనీ విమానం, దాని సిబ్బంది నిర్వహణ, విమాన ప్రయాణానికి ముందు ప్రణాళికను సిద్ధం చేయాలి. దీంతో పాటు అత్యంత సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించాలి.

Advertisement

సీఈవోతో పాటు ప్రయాణం
ఈ ఉద్యోగంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఎంపికైన పైలట్ స్టార్‌బక్స్‌లోని ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పనిచేయాలి. అందుకే అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలతో పాటు ప్రొఫెషనల్ బిహేవియర్ కలిగి ఉండడం చాలా అవసరం. స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్ ఈ విమానంలో తరచూ ప్రయాణిస్తూ ఉంటారు. ఆయన కాలిఫోర్నియాలోని తన ఇంటి నుండి సీటెల్‌ నగరానికి స్టార్‌బక్స్ ప్రధాన కార్యాలయానికి వారంలో ఎక్కువ రోజులు 1,000 మైళ్ల దూరం ప్రయాణిస్తారు. ఈ ఉద్యోగంలో భాగంగా ప్రయాణికులకు లగేజ్ కు సంబంధించిన సాయం కూడా చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగ అర్హతలు
ఈ ఉద్యోగానికి పూర్తిస్థాయిలో విమానం నడిపే నైపుణ్యం అవసరం. దరఖాస్తుదారుడికి కార్పొరేట్ ఫ్లైట్ విభాగంలో కెప్టెన్‌గా 5 సంవత్సరాల అనుభవం, మొత్తం 5,000 గంటల విమాన నడపడం అనుభవం ఉండాలి. అలాగే, ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ సర్టిఫికేట్, ఫస్ట్-క్లాస్ మెడికల్ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఎఫ్‌సిసి (FCC) రిస్ట్రిక్టెడ్ రేడియో ఆపరేటర్ పర్మిట్ తప్పనిసరి.

Advertisement

Also Read: 10 లక్షల ఉద్యోగాలు.. 2026 నాటికి ఏఐ రంగంలో దేశవ్యాప్తంగా భారీ డిమాండ్

స్టార్‌బక్స్ బారిస్టా ఉద్యోగుల కంటే ఈ స్టార్ బక్స్ పైలట్ ప్రతినిధి జీతం 10 రెట్లు ఎక్కువ. దరఖాస్తుదారులు స్టార్‌బక్స్ కాఫీ కంపెనీ ఇమేజ్‌ను సానుకూలంగా ప్రతిబింబించేలా, సభ్యత, గౌరవపూర్వక ప్రవర్తన కలిగి ఉండాలి.

స్టార్‌బక్స్ కెప్టెన్-పైలట్-ఇన్-కమాండ్‌గా ఉద్యోగం చేసేవారు.. ప్రయాణికుల పట్ల కంపెనీ ప్రతినిధి ఉత్తమ సేవ కనబర్చాలని ఉద్యోగ వివరణలో పేర్కొనబడింది. ఈ ఉద్యోగం స్టార్‌బక్స్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధించే అవకాశాన్ని అందిస్తుంది. అయితే, దీనికి అధిక నైపుణ్యం, బాధ్యత, ప్రొఫెషనలిజం అవసరం. ఈ పాత్రలో ఎంపికైన వ్యక్తి స్టార్‌బక్స్ కంపెనీ ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వహిస్తూ, కంపెనీ ప్రతిష్ఠను కాపాడే బాధ్యతను కూడా వహించాలి.

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×