E-Paper
Advertisement

Viral Video: గుడిలో చెప్పులు వేసుకొని.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చావగొట్టిన భక్తులు..!

Viral Video: గుడిలో చెప్పులు వేసుకొని.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చావగొట్టిన భక్తులు..!
Advertisement

Viral Video:  ప్రస్తుత రోజుల్లో ప్రీ వెడ్డింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వధూవరులు.. మంచి లోకేషన్ ఎంచుకొని ఫొటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కర్ణాటకు చెందిన ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఓ గుడిని ఎంచుకుంది. అయితే ఫొటోగ్రాఫర్లు చేసిన ఓ తప్పిదం కారణంగా.. గుడిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ మహాకూట ఆలయ (Mahakuta Temple) ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పురాతన క్షేత్రం. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ బృందంలోని కొందరు ఫోటోగ్రాఫర్లు, సిబ్బంది ఆలయ నిబంధనలను ఉల్లంఘించి.. పవిత్రమైన పుష్కరిణి (ఆలయ కోనేరు) సమీపంలో షూలు, చెప్పులు ధరించి తిరుగుతున్నట్లు స్థానికులు, భక్తులు గమనించారు.

Advertisement

భక్తులు చెప్పినా.. వినకపోవడంతో..

ఆలయ పరిసరాల్లో షూలు ధరించడం నిషేధమని చెప్పినప్పటికీ.. ఫొటోగ్రాఫర్లు పట్టించుకోలేదని సమాచారం. ఈ క్రమంలో భక్తులు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీసింది. కోపంతో ఉన్న కొందరు స్థానికులు ఫోటోగ్రాఫర్లపై భౌతిక దాడికి దిగారు. వారి కెమెరాలు, ఇతర ఖరీదైన షూటింగ్ పరికరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మాస్ డైలాగ్స్‌కు.. సరిగ్గా మూడేళ్లు.. రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయ్..!

దాడి దృశ్యాలు వైరల్..

మరోవైపు దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ఇరువర్గాలు తీవ్రంగా ఘర్షణ పడటం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు దాడి దృశ్యాలు వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ పేరుతో గుడిలోకి దూరి ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. అదే సమయంలో భక్తులు, స్థానికులు.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని.. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

Also Read: IndiGo Flight: విశాఖ నుంచి బయల్దేరిన ఫ్లైట్‌లో.. సాంకేతిక సమస్య.. దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×